రెండో సీడ్‌పై సంచలన విజయం
న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఆక్లాండ్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో రెండో సీడ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ ప్రణయ్ 21 21 తేడాతో ఇండోనేసియా స్టార్, రెండో సీడ్ టామీ సుగియార్తోను వరుస గేమ్‌లలో చిత్తు చేసి ముందంజ వేశాడు. భారత అగ్రశ్రేణి షట్లర్లు వరుస ఓటములతో నిరాశ పరుస్తుంటే ప్రణయ్ మాత్రం సుగియార్తోపై విజయం సాధించి సత్తా చాటుకున్నాడు. చాలా కాలం తర్వాత ప్రణయ్ ఒక అగ్రశ్రేణి ర్యాంకర్‌ను ఓడించాడు. కొంత కాలంగా గాయాలతో పాటు ఫామ్‌లో లేక ప్రణయ్ తన ఆటపై పట్టు సాధించలేక పోతున్నాడు. ఫలితంగా ఘోరా ఓటములను చవిచూస్తున్నాడు. అయితే న్యూజిలాండ్ ఓపెన్‌లో మాత్రం మంచి హోమ్‌వర్క్ చేసి వచ్చిన భారత సీనియర్ షట్లర్ మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. తొలి రౌండ్‌ను సునాయాసంగా గెలుచుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లోనూ అదే జోరును ప్రదర్శించి తనకంటే ర్యాంకింగ్స్‌లో మెరుగైన ప్లేయర్‌ను చిత్తు చేశాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ 26వ ర్యాంక్‌లో ఉంటే.. అదే మలేసియా ఆటగాడు సుగియార్తో ప్రపంచ 13వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మ్యాచ్ కంటే ముందు ఈ మలేసియా స్టార్‌పై నెగ్గడం ప్రణయ్‌కు కష్టమని అందరూ భావించారు. కానీ ప్రణయ్ తన పాత ఫామ్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థికు ఊహించని పెద్ద షాకిచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ప్రణయ్ ఒకొక్క పాయింట్ చేస్తూ ముందుకు సాగాడు. మరోవైపు సుగియార్తో కూడా ధాటిగానే ఆడుతూ పాయింట్లు చేస్తూ పోయాడు. అయితే చివర్లో జోరును పెంచిన ప్రణయ్ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. వరుస స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లాడు. చివరి వరకు ఆధిక్యంను కాపాడుకున్న ప్రణయ్ తొలి గేమ్‌ను 21 తేడాతో గెలుచుకున్నాడు. తర్వాత జరిగిన రెండో గేమ్‌లోనూ అదే జోరును ప్రదర్శించిన ప్రణయ్ నెట్లో చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. వరుస పాయింట్లు చేస్తూ మ్యాచ్‌లో పై చేయి సాధించాడు. ప్రణయ్ జోరును తట్టుకోలేక సుగియార్తో చివరికి చేతులెత్తేశాడు. దాంతో ప్రణయ్ 21 రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకోని క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌ను ప్రణయ్ 37 నిమిషాల్లోనే ముగించేశాడు.
సాయి ప్రణీత్ ఔట్..
పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో బి సాయి ప్రణీత్ 12 12 మాజీ ప్రపంచ నంబర్ వన్, చైనా అగ్రశ్రేణి ఆటగాడు లీన్ డాన్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఎడో సీడ్ లీన్ డాన్ తొలి గేమ్ నుంచే చెలరేగి ఆడాడు. భారత ఆటగాడికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌లలో సునాయాసంగా విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
మనుఅత్రి జోడీ పరాజయం..
పురుషుల డబుల్స్‌లో మను అత్రి జోడీ పరాజయం పాలైంది. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో మను అత్రి, సుమిత్ రెడ్డి (భారత్)ల జోడీ 17 19 తేడాతో ఏడో సీడ్ గొ వి షెమ్, టాన్ వీ కియంగ్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. అంతకుముందు రోజు జరిగిన మ్యాచులో భారత మహిళా స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ 212వ ర్యాంకర్ చైనా ప్లేయర్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెండో రోజు ఆట ముగిసే సరికి హెచ్ఎస్ ప్రణయ్ మినహా మిగతా భారత షట్లర్లందరీ పోరు ముగిసింది.
క్వార్టర్స్‌లో ప్రణయ్
RELATED ARTICLES