పురుషుల హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఇక్కడి కళింగ స్టేడియంలో సోమవారం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్, చైనాపై ఫ్రాన్స్ జట్లు గెలుపొంది నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2- గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడును కనబరిచిన ఇంగ్లాండ్ జట్టు వరుసదాడులతో కివీస్‌ను హడలెత్తించింది. 25వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు కల్నన్ విల్ కళ్లు చెదిరే గోల్‌తో తమ జట్టు ఖాతా తెరిచాడు. తర్వాత 44వ నిమిషంలో లుకె మరో గోల్ చేసి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2 చేర్చాడు. మరోవైపు న్యూజిలాండ్ చేసిన దాడులను ఇంగ్లాండ్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ పూర్తి సమయం ముగిసే వరకు మరో గోల్ నమోదుకాలేక పోవడంతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇక క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ ఇంగ్లాండ్‌తో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా తలపడనుంది. తర్వాత జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1- చైనాపై గెలిచింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఫ్రాన్ ఏకపక్షంగా మ్యాచ్‌ను కైవసం చేసుకుని నాకౌట్ పోటీలకు అర్హత సాధించింది. ఫ్రాన్స్ తరఫున 36వ క్లెమెంట్ టిమోటి 36వ నిమిషంలో గోల్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఢీ కొననుంది.
క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్
RELATED ARTICLES