చెన్నై: ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత జట్టు మిగిలిన ఆఖరి టి20లో కూడా విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే లక్షంతో ఆదివారం బరిలో దిగుతోంది. ఈ రోజు చెన్నై వెదికగా భారత్-వెస్టిండీస్ మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్ జరుగనుంది. వరస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. భారత పర్యటనలో ఉన్న కరేబియన్ జట్టు పెలవమైన ఆటతో టెస్టు, వన్డే, టి20 మూడు సిరీస్ కోల్పోయింది. అయితే ఇప్పుడు మిగిలి ఉన్న చివరి టి20 మ్యాచ్ గెలిచి తమ పరువును నిలుపుకోవాలనే ఉద్దేశంతో విండీస్ జట్టు ఆదివారం మైదానంలో అడుగుపెట్టనుంది. ఈ చివరి మ్యాచ్ భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. సీనియర్ బౌలర్లకు విశ్రాంతి నిచ్చి వారి స్థానంలో బెంచ్ బౌలర్లకు అవకాశం కల్పించారు. ఇది విండీస్ బ్యాట్స్ కలిసొచ్చే అంశం. దానిని వారు ఎంత వరకు అస్వాదిస్తారో చూడాలి. ఉమేశ్ యాదవ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ విశ్రాంతి నిచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ రాణించిన హైదరాబాద్ సన్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఈ మ్యాచ్ ఆడించనున్నారు. అతనికిది మంచి అవకాశం. తొలి అంతర్జాతీయ టి20 సిరీస్ ఆడుతున్న యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ అంది వచ్చిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ సీనియర్ భువనేశ్వర్ పాటు ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్పిన్నర్లలో చాహల్, కృనాల్ పాండ్యా మంచి ప్రదర్శనే చేస్తున్నారు. ఆల్ రౌండర్ కృనాల్ బాల్ పాటు బ్యాట్ కూడా సత్తాచాటుతున్నాడు. బ్యాటింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ ఉన్నాడు. అకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఇతడు క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు వణుకే.. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు. ప్రస్తుతం భారత బ్యాట్స్ రోహిత్ సంచలనాలు సృష్టిస్తు కోహ్లీకి గట్టి పోటీనిస్తున్నాడు. టి20ల్లో కోహ్లీ పేరున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తాజాగా రోహిత్ అదిగమించాడు. విండీస్ జరిగిన రెండో టి20లో సెంచరీ సాధించిన రోహిత్ ఈ ఫార్మాట్ అత్యధిక (4)సెంచరీలు సాధించిన బ్యాట్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ కాలిన్ మున్రో (3) సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా మంచి ఫామ్ ఉన్నాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుంటే ధవన్ అతనికి స్ట్రాయిక్ రొటేట్ చేస్తూ అండగా నిలిస్తున్నాడు. మరోవైపు కెఎల్. రాహుల్, దినేష్ కార్తిక్, మనీష్ పాండే రిషభ్ పంత్ కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. చివరి మ్యాచ్ టీమిండియా రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతుందని భారత సారథి రోహిత్ శర్మ అన్నాడు. మరోవైపు మిగిలిన ఒక్క మ్యాచ్ గెలిచి తమ పరువును నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ జట్టు భావిస్తోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, కెఎల్. రాహుల్, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షాబాద్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్.
వెస్టిండీస్ జట్టు: షయ్ హోప్, నిఖోలాస్ పూరన్ (వికెట్ కీపర్), హేట్ డారెన్ బ్రావో, కిరణ్ పొలార్డ్, బ్రాత్ (కెప్టెన్), రొమన్ పొవెల్, కీమో పౌల్, ఫబిన్ అలెన్, క్యారి పిరే, థోమస్.
క్లీన్‌స్వీప్ లక్ష్యం!
RELATED ARTICLES