మార్పులతో బరిలోకి భారత్
పరువుకోసం న్యూజిలాండ్
నేడు చివరి టి20 మ్యాచ్
కోహ్లీ విశ్రాంతి.. పంత్‌కు ఛాన్స్
బే ఓవల్ : న్యూజిలాండ్ గడ్డపై వరుసగా నాలుగు టీ20ల్లో గెలుపొందిన భారత్ జట్టు.. ఆదివారం జరిగే ఐదో టీ20లోనూ గెలిచి సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో రెండు సార్లు ఆ గడ్డపై టీ20 సిరీస్ ఆడిన టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. కానీ.. తాజాగా పర్యటనలో వరుసగా అదీ.. 3, 4వ టీ20లో సూపర్ ఓవర్ ద్వారా గెలుపొందడం ఇప్పుడు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. బే ఓవల్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఐదో టీ20 మ్యాచ్ జరగనుండగా.. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కెఎల్ రాహుల్ నాలుగో టీ20లో జరిగిన సూపర్ ఓవర్లో తొలి రెండు బంతుల్నీ 6,4గా మలిచిన కెఎల్ రాహుల్.. ఇప్పుడు టీమిండియాలో తిరుగులేని ఆటగాడిగా ఎదిగిపోయాడు. జట్టు అవసరాలకి అనుగుణంగా ఓపెనర్, నెం.3, నెం.5లో ఆడే సామర్థ్యం ఉండటం అతనికి కలిసొస్తోంది. ఇప్పుడు అదనంగా వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కూడా అతను మోస్తున్నాడు. ఇక సంజు శాంసన్ నాలుగో టీ20లో ఆరంభంలోనే సిక్స్ బాది మంచి ఊపుమీద కనిపించిన సంజు శాంసన్ ఆ వెంటనే ఔటవడం అందర్నీ నిరాశపరిచింది. అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ అతనికి మరోక అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆఖరి టీ20లోనూ రాహుల్‌తో కలిసి సంజు శాంసన్ భారత్ ఇన్నింగ్స్‌ని ఆరంభించనున్నాడు. దీంతో రోహిత్ శర్మకి రెస్ట్ కొనసాగనుంది. అయితే విరాట్ కోహ్లీ న్యూజిలా్‌ండ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. క్లీస్‌స్వీప్ చేయడం ద్వారా అరుదైన ఘనతని కూడా సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ ఓవర్లలో టీమిండియా గెలుపొందడం కోహ్లీకి చెప్పలేని సంతోషాన్నిస్తోంది. అయితే.. కోహ్లీ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్‌ని టీమిండియా ఆశిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ తొలి రెండు టీ20ల్లోనూ గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్.. నాలుగో టీ20లో అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఈ టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుండటంతో శ్రేయాస్ మళ్లీ ఫామ్ అందుకోవడం టీమిండియాకి ముఖ్యం. శ్రేయాస్ మెరుగ్గా ఆడగలిగితేనే..? భారత్ జట్టు మిడిలార్డర్లో నిలకడ, దూకుడు కనిపిస్తోందని చెప్పొచ్చు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఈ సిరీస్‌లో తనకి దొరికిన అవకాశాల్ని వినియోగించుకోలేకపోయాడు. దీంతో.. ఐదో టీ20లో అతనిపై వేటు వేసి.. రిజర్వ్ బెంచ్‌పై ఉన్న రిషబ్ పంత్‌ని ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. పంత్ టీమ్‌లోకి వచ్చినా.. కీపింగ్ మాత్రం కెఎల్ రాహుల్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా చివరి మ్యాచ్‌లో గెలిచి కివీస్‌కు వైట్‌వాష్ చేయాలనే యోచనలో భారత్ ఉన్నట్లు కనిపిస్తోంది.
పరువు కోసం బ్లాక్ క్యాప్స్..
చివరి టి20లో ఇండియా ఘనమైన రికార్డు కోసం ఆరాటపడుతుంటే.. న్యూజిలాండేమో చెత్త రికార్డును తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తుంది.. నిజానికి గత రెండు మ్యాచులలో విజయానికి చేరువలోకి వచ్చి ఆఖరి దశలో ఓడిపోయింది న్యూజిలాండ్ కనీసం చివరి మ్యాచ్‌నైనా కాపాడుకుని కాసింత పరువు నిలుపుకుందామనుకుంటోంది న్యూజిలాండ్ గడ్డపై టీటి20 సిరీస్‌ను ఇండియా గెలవడం ఇదే మొదటిసారి.. 2009లో 0–2తో ఓడిపోయిన ఇండియా 2019లో 1–2తో సిరీస్‌ను చేజార్చుకుంది.. ఈసారి మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెల్చుకుని వారెవ్వా అనిపించుకుంది. ఒకవేళ రేపటి మ్యాచ్‌లోనూ ఇండియా గెలిస్తే అదో రికార్డవుతుంది.. న్యూజిలాండ్‌లో అయిదు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇంత వరకూ లేదు. ఆ క్రెడిట్ భారత్‌కు సొంతమవుతుంది. అలాగే న్యూజిలాండ్ కూడా ఇలా అయిదు టి-20లను ఎప్పుడూ ఓడిపోలేదు. గాయం కారణంగా నాలుగో టి20లో ఆడని కేన్ విలియమ్స్ రేపటి మ్యాచ్‌కు రెడీ అయ్యాడు. అచ్చొచ్చిన స్టేడియంలో అడటం న్యూజిలాండ్‌కు కలిసివచ్చే మరో అంశం. ఇక్కడ ఇప్పటి వరకూ న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
కోహ్లీకి విశ్రాంతి.. పంత్‌కు అవకాశం..
ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్ఇండియా ఆఖరి మ్యాచులోనూ ప్రయోగాలకే పెద్దపీట వేయనుంది. సంజు శాంసన్, శివమ్ దూబెకు మరో అవకాశం ఇవ్వనుంది. దూకుడుగా ఆడే క్రమంలో శాంసన్ త్వరగా ఔటవుతున్నాడు. అతడు సహనంతో ఆడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. భారీ షాట్లు ఆడగల దూబె ఫుట్‌వర్క్ మెరుగుపర్చుకొని సత్తా నిరూపించుకోవాలి. ఒకవేళ హార్దిక్ పాండ్య ఫిట్నెస్ సాధిస్తే అతడికి చోటు ప్రశ్నార్ధకం అవుతుంది. నాలుగో టీ20కి రోహిత్, షమి దూరమయ్యారు. వారిద్దరు ఇప్పుడు కెప్టెన్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతినిస్తారని సమాచారం. శ్రేయస్ మూడో స్థానంలో, అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చిన మనీశ్ పాండేకు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారు. కంగారూలతో వన్డే సిరీస్‌లో కంకషన్తో బాధపడుతున్న రిషభ్ పంత్ స్థానంలో కీపింగ్ చేశాడు కేఎల్ రాహుల్. అప్పట్నుంచి అతడే ప్రతి మ్యాచ్‌లో అదనంగా కీపింగ్ బాధ్యతలు మోస్తున్నాడు. రాణిస్తున్నాడు. జట్టులో సరికొత్త ఆశలు రేకెత్తించాడు. ఇదే అదనుగా కెప్టెన్ కోహ్లీ మరిన్ని ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆఖరి టీ20లో రాహుల్‌కు విశ్రాంతినివ్వొచ్చు. రిషభ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే అతడికి ఎంతో ఒత్తిడి పెరిగింది. అటు కీపింగ్ ఇటు బ్యాటింగ్‌లో రాణించక తప్పని పరిస్థితి నెలకొంది. ధోనీకి వారసుడిగా భావించిన అతనిప్పుడు తొలి ప్రాధాన్య కీపర్ కాకుండా పోయాడు! భారత్‌కు 2019–20 సీజన్లో ఇదే చివరి టీ20 పోరు. మార్చి చివర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఆ తర్వాత శ్రీలంక సిరీస్ మొదలవుతుంది.
భారత్ తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రిజర్వ్ బెంచ్: రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, చాహల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా
క్లీన్‌స్వీప్‌పై గురి
RELATED ARTICLES