పేలుడులో ముగ్గురు మృతి
రష్యా నుండి సరుకులు,సేనల రవాణాకు ఏకైక భూ మార్గం
ఖార్కివ్ : రష్యా అధీనంలో ఉన్న క్రిమియాకు, రష్యాకు మధ్య రాకపోకలు చేయడానికి ఉన్న ఏకైక కీలకమైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ పై శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో 19 కిలోమీటర్లు నిడివిగల వంతెన మా ర్గం ధ్వంసమైంది. రష్యా నుండి నిత్యావసర వస్తువులతోపాటు రష్యా సేనలు, వాహనాలు క్రిమియాకు, దక్షిణ ఉక్రేన్‌కు వెళ్ళాలంటే ఇదొక్కటే ఏకైక భూ అనుసంధాన మార్గం. ఈ మార్గంలలో ట్రక్ బాంబు పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు.పేలుడు సమయంలో ఒక వాహనంపై వెళుతున్న భార్యాభర్త మరణించారు. వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు మూడో మృతుణ్ణి ఇంకా గుర్తించవలసి ఉంది. ఈ పేలుడుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే పేలుడు తర్వాత తేలికపాటి చిన్న వాహనాలు వెళ్ళడానికి ఈ మార్గాన్ని పునరుద్ధరించారు. రైలు మార్గంలో ఒకభాగం, రోడ్డు మార్గంలో ఒక భాగం ధ్వంసమయ్యాయి. నల్లసముద్రా న్ని, అజోవ్ సముద్రాన్ని అనుసంధానం చేసే లా కెర్చ్ మీదుగా 3.60 బిలియన్ల డాలర్లతో నిర్మించిన ఈ వంతెనను 2018లో ప్రారంభించారు. రష్యా నుండి యూరప్ వరకూ బాల్టిక్ సముద్రంలోపల వేసిన గ్యాస్ సరఫరా పైపులైను ధ్వంస(నోర్డ్ స్ట్రీమ్ సోబటేజ్) మైన విద్రోహచర్య జరిగిన 10 రోజుల తరువాత క్రిమియా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి ధ్వసమైన సంఘటన సరికొత్త పరిణామాలకు దారితీస్తుందని అంచనావేస్తున్నారు. స్వీడన్ సెక్యూరిటీ దళా లు ఈ గ్యాస్‌పైపులైన్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో దర్యాప్తు చేస్తున్న దశలోనే రష్యాను దెబ్బతీసే మరో తాజా సంఘటన జరిగింది. ఏడు రైల్వే కోచ్‌లు ఇంధనాన్ని తీసుకువెళుతుండగా ట్రక్ బాంబ్ జరిగిదని, ఆ కారణంగా ఇంథనం మోసుకెళుతున్న రవాణా ట్యాంకులు అగ్నికి ఆహుతై మరింత భారీ పేలుడుకు దారితీసిందని రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. ఇది ఉగ్రవాద చర్యా? అనే విషయాన్ని రష్యా అంచనా వేస్తున్నది. ఈ ఘటనతో వంతెనలో రెండు భాగాలు కుప్పకూలాయి. తాత్కాలిక మరమ్మతులకు వీలుకాని విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. అయితే రష్యా ఉగ్రవాద వ్యతిరేక బృందం ఈ ఘటనకు వెంటనే ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు. క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు స్పీకర్ మాత్రం ఈ ఘటనకు ఉక్రేన్ కారణమని విమర్శించారు. కొంతకాలంగా ఈ వంతెనను కూల్చివేస్తామని ఉక్రేన్ ప్రభుత్వ అధికారులు పదే పదే హెచ్చరికలు చేశారని ఆయన గుర్తు చేశారు. వంతెన ధ్వంసమైన కారణంగా రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పానికి నిత్యం సరుకులతోపాటు, ఇతర యుద్ధ సామాగ్రిని కూడా తరలించడానికి రోజువారీ రాకపోకలకు రైలు మార్గంలో తీవ్ర అంతరాయం కలిగింది. రష్యావిదేశీమంత్రిత్వశాఖ ఈ ఘటనను ఏప్రిల్‌లో జరిగిన క్షిపణి దాడితో పోల్చి చూస్తూ, ఉక్రేన్ ఉగ్రవాద మనస్తత్వానికి ఈ చర్య ప్రతిబింబమని వ్యాఖ్యానించింది.
క్రిమియా బ్రిడ్జి ధ్వంసం
RELATED ARTICLES