డబ్ల్యు.టి.విట్నే జూనియర్
కొవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలో ఎంతో సమర్థవంతం గా టీకాను ఉత్పత్తి చేసిన క్యూబా విజ్ఞానశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ విజయం గ్లోబల్ సౌత్ (తక్కువ అభివృద్ధిచెందిన, వెనుకబడిన దేశాలు)లో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార ఉత్పత్తికి సంబంధించిన జీవ ఉత్పత్తుల మార్కెటింగ్, అభివృద్ధిలో దశాబ్దాలపాటు చేసిన కఠోరమైన శాస్త్రవిజ్ఞానాభివృద్ధి కృషికి ఇది ప్రతిబింబం. ఎంతో భిన్నమైన ఈ ప్రణాళికా ప్రక్రియ, వ్యూహం, సంస్థాగతమైన పద్ధతుల ఫలితమే ఇదంతా. ఈ ప్రత్యేక లక్షణాలు ప్రత్యక్షంగా క్యూబా తరహా సోషలిజంతో ముడిపడి ఉన్నాయి. క్యూబా విప్లవం జరిగిన ఏడాది తర్వాత 1960 జనవరి 15వ తేదీన ఆ దేశాధ్యక్షుడు ఫైడెల్ కాస్ట్రో చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు ఈనాటికీ వారికి ఆదర్శనీయం. “క్యూబా భవితవ్యం తప్పనిసరిగా శాస్త్రవేత్తలపైనే ఆధారపడి ఉంది, ప్రపంచాన్ని ఇది మార్చేస్తుంది” అని కాస్ట్రో ఆనాడు చెప్పారు. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్సెస్ విభాగాన్ని 1962లో పునరుద్ధరించారు. దాని పారంపర్యంగా అనేక ప్రయత్నాలతో 1965లో క్యూబా నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏర్పడింది. 1982లో సెంటర్ ఫర్ బయలాజికల్ రీసెర్చ్ ఆవిర్భవించింది. అదేక్రమంలో 38 సైంటిఫిక్ ఇనిస్టిట్యూషన్స్‌తో కలిసి 1986 లో సెంటర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఏర్పడింది. 1987 లో ద ఇమ్యునోస్సీ సెంటర్, 1991లో ద వాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫిన్లే ఇనిస్టిట్యూట్, 1992లో నేషనల్ సెంటర్ ఫర్ బయో ప్రిపరేషన్స్, 1994లో ద సెంటర్ ఫర్ మాలిక్యులర్ ఇమ్యునోలజీ సంస్థలు కూడా వరుసక్రమంలో ఆవిర్భవించి క్యూడా ఆర్థిక, సామాజిక అభ్యున్నతిలో కీలకపాత్ర వహిస్తున్నాయి. 1980లో పశ్చిమ హవానాలో ఆవిర్భవించిన ‘సైంటిఫిక్ పోల్’ ఈనాడు నలభై రీసెర్చ్ సెంటర్లతో అలరారుతూ 30,000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. 2012లో ఆవిర్భవించిన బయోక్యూబా ఫార్మా ద్వారా వాణిజ్య ఎగుమతులు జరుగుతున్నాయి. 65 కేంద్రాల ద్వారా 164 ఉత్పత్తులను క్యూబా ఎగుమతి చేస్తున్నది. క్యూబా మాలిక్యులర్ ఇమ్యునోలొజీ సెంటర్ అధిపతిగా అనేక దశాబ్దాలలు సేవలు అందించిన డాక్టర్ అగస్టిన్ లాగ్ రాసిన పుస్తకంలో కమ్యూనిస్టుదేశం క్యూబా పరివర్తన, దాని శాస్త్ర విజ్ఞానాభివృద్ధిని కూలంకషంగా అభివర్ణించారు. విజ్ఞానశాస్త్రంలో బహుముఖంగా సాధించిన ప్రగతి, వివిధ వ్యవస్థల పరిశోధనా తీరుతెన్నులు, వాటి వాణిజ్య ఉత్పత్తులు, ఎగుమతుల గురించి విపులంగా తెలియజేశారు. ఈ మొత్తం వ్యవస్థలన్నీ ఒకేఒక ఛత్రం కింద యాజమాన్య నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఎగుమతులద్వారా వచ్చే ఆదాయాలను తిరిగి ఈ సంస్థల అభివృద్ధి, కార్యకలాపాలకోసమే పెట్టుబడులుగా నేషనల్ బడ్జెట్‌లో సమకూరుస్తారు. ఈ ఎగుమతులలో మెనింజైటిస్ బి (మెదడు, వెన్నుముకల్లో చేరి వాటిని తినేసే బాక్టీరియా రోగం) టీకా, హెపటైటిస్ బి, హీమోఫీలియస్ ఇన్‌ఫ్లుయంజా టైప్ బి, కొవిడ్ టీకా, ఊపిరితిత్తుల క్యాన్సర్ (సిఐఎం వ్యాక్స్ ఇజిఫ్) మందులతోపాటు అనేక ఇతర రకాల అంటువ్యాధులకు మందులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నది క్యూబా. ఇంటర్‌ఫెర్నోస్, ఎరిత్రోపోయిటిన్, స్ట్రెక్ట్రోకినేస్, హెబెర్‌ప్రోప్ట్ (డయాబెటిస్ వల్ల కాలికి వచ్చే పుండుకు చికిత్స), డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్లు, కరోనా చికిత్సలకు సంబంధించిన మరో ఆరు రకాల టీకా యేతర చికిత్సా పద్ధతులను కూడా ప్రపంచానికి అందించింది. డాక్టర్ అగస్టిన్ లాగ్ రాసిన ఈ సవివరణాత్మకమైన పుస్తకం 2013లో ప్రచురితమైంది. 2016లో మరోసారి కొత్త సమాచారంతో పునర్ముద్రితమైంది. ఈ మధ్యనే “ద నాలెడ్జ్ ఎకానమీ అండ్ సోషలిజం అండ్ సొసైటీ ఇన్ క్యూబా” అనే టైటిల్‌లో మంత్లీ రివ్యూ ప్రెస్ అనువదించిన ఈ పుస్తకం సెకండ్ ఎడిషన్‌ను ప్రచురించింది. ఈ పుస్తకంలో అనేక అధ్యాయాలను పరిశీలిస్తే, ఇమ్యునోలజిస్ట్, బయోకెమిస్ట్, క్యాన్సర్ ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన డాక్టర్ అగస్టిన్ క్యూబా జర్నల్స్‌లో రాసిన వ్యాసాలు ఉంటాయి. ఆయన అనేక ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు మరో అధ్యాయంలో ఉంటాయి. పాఠకులను సునాయాసంగా చదివించేవిధంగా ఈ పుస్తకాన్ని ఆంగ్లభాషలోకి అనువదించారు. విజ్ఞానశాస్త్ర పురోగతికి సంబంధించిన సమాచారం, విశ్లేషణలు, చారిత్రక ప్రస్తావనలు, పెద్ద పెద్ద సమస్యలకు సమతుల్యంగా ఆశాభావంతో చెప్పిన అభిప్రాయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
మార్క్ చెప్పిన సోషల్ ఓనర్‌షిప్పే శిరోధార్యం
క్యూబా విప్లవం తర్వాత విజ్ఞానశాస్త్రంలో, వైద్యరంగ పరంగా జరిగిన అభివృద్ధిని ఈ పుస్తకంలో ఆయన వివరించారు. సామాజిక పురోగతికోసం మానవ శక్తి సామర్థ్యాలను ఏ విధంగా అభివృద్ధి చేసింనదీ ఆయన వివరించారు. నిధులకోసం, పెట్టుబడులకోసం ఎదురుతెన్నులు చూడకుండా జరిగిన కృషిని వివరించారు.వెంచర్ క్యాపిటలిజంపైనే వారుఆధారపడ్డారు. ఫలితంగా క్యూబాలో నాలెడ్జ్ ఎకానమీని నిర్మించారు. దీని ఫలితంగా ప్రకృతి వనరులను తవ్వితీసి యథాతథగా ఎగుమతిచేయడం, పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి బదులుగా నాలెడ్జ్ ఎకానమీ ద్వారా సాధించిన సైంటిఫిక్ ప్రోడక్ట్‌ను ఎగుమతులు చేస్తున్నారు. వీటికి మేథోపరమైన హక్కులు ఉన్నాయి. విజ్ఞానశాస్త్రాన్ని వారు ఏకీకృతం చేశారు. వీటికి వ్యవస్థీకృత హద్దులను చెరిపేశారు. కేంద్రీకృత నిర్ణయాలు, స్వయంప్రతిపత్తికే ప్రాధాన్యం. పెట్టుబడిదారా నమూనాలకు భిన్నంగా బయోటెక్నికల్ ఉత్పత్తులను చేస్తారు. ప్రోడక్ట్ వాల్యూ, ఉత్పత్తి నిర్దేశాలలో కార్ల్ మార్క్స్ చెప్పిన సామాజిక లక్షణాలనే ఈ సంస్థలు పాటిస్తునన్నాయని రచయిత ఆగస్టిన్ లాగ్ పేర్కొన్నారు. ఒక సోషలిస్టు దేశంగా క్యూబా సోషల్ ఓనర్‌షిప్‌నే సమర్థిస్తుంది. విజ్ఞానశాస్త్రాన్ని జాతి ఆస్తిగానే క్యూడా పరిగణిస్తుంది. ఆగస్టిన్ లాగ్ మాటల్లో చెప్పాలంటే, వారి రోజువారీ లక్ష్యం ఒక అతిపెద్ద చారిత్రక లక్ష్యమే. దేశ సార్వభౌమాధికారం ఈ రెండింటిమధ్యా విడదీయరాని అనుబంధం ఉంటుంది. క్యూబా సంస్కృతి, వారి నమ్మకాలు, విశ్వాసాలు, నైతిక విలువలు, సంఘీభావం ఐక్యతవైపే ఎప్పుడూ మొగ్గుచూపడం వంటివన్నీ క్యూబా అభివృద్ధికి దోహదపడ్డాయని డాక్టర్ అగస్టిన్ నొక్కి చెబుతారు. “మేం నిత్యం సన్నిహితంగా ఉంటాం, అదంతా నాలెడ్జ్ ఎకానమీని సాధించడంకోసమే. ప్రతీ సాంఘిక కార్యక్రమాన్నీ ప్రతి రోజూ విజయవంతంగా మేం అమలు చేస్తాం, తద్వా రా మాదేశ ప్రజల భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలను నిర్మించుకోవడమేకాదు,దేశ సార్వభౌమాధికారాన్ని కూడా రక్షించుకుంటాం” అని డాక్టర్ అగస్టిన్ చెబుతున్నారు ఈ పుస్తకంలో.స్థానికంంగా నిర్మించిన నాలెడ్జ్ ఎకానమీ గురించి ఆయన చర్చించారు. ప్రత్యేకించి జాతీయ అసెంబ్లీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాంక్టీ స్పిరిటస్‌కు సమీపంలోని యగుయాజై మునిసిపాలిటీ పరిధిలో చేసిన అభివృద్ధిని ఆయన చర్చించారు. ఒక మునిసిపాలిటీలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని ఆయన ఉదహరించారు. ఈ అభివృద్ధిలో నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌లో సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ కేంద్రాలపాత్రను ఆయన ప్రస్తావించారు. దీనివల్ల వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, టూరిజం అభివృద్ధి, హౌసింగ్ ప్రమోషన్, కంప్యూటింగ్‌లలో నాణ్య తా ప్రమాణాలతో కూడిన మార్పులు సాధించారు.
క్యూబా సోషల్ ఓనర్‌షిప్ అమెరికా ఆర్థిక దిగ్బంధనం
సోషల్ ఓనర్‌షిప్‌ను క్యూబా సమర్థిస్తుంది. దాన్ని కాపాడుకుంటుంది. ఉత్పత్తుల ద్వారా, వాటి విలువ ద్వారా ఆర్జించిన ఆదాయం ఈ సోషల్ ఓనర్‌షిప్‌కే చెందుతుంది. సామూహిక ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా అసలైన మానవ వనరులు, సంస్థలమధ్య సమగ్రత, సామాజిక కార్యక్రమాల ద్వారా అనసంధానం, క్యూబా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ముడిపడిన ఎగుమతులు, సంఘీభావ కార్యక్రమాలు, వ్యవస్థలను, కార్మికులను నిర్వహించడంలో ఆధునిక పద్దతులు, రాజకీయ, సాంఘిక చైతన్య పద్ధతులను క్యూబా అనుసరిస్తున్నది. సోషలిజం శక్తిసామర్థ్యాలు ఏమిటో వారికి బాగా తెలుసు. ఒక దేశ భౌతిక సంపద వృద్ధి విద్యపైనా, మానసిక భావజాల సంపదపైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయం క్యూబా ప్రజలకు బాగా తెలుసు. అమెరికా అనుసరిస్తున్న విరోధభావం,ఆర్థిక ఆంక్షలు, దురాక్రమణ ఆలోచనలు కొనసాగుతున్నాగానీ వారు సొంతంగా మనుగడ కొనసాగిస్తున్నారు. రాబోయే సమస్యలను, అపాయాలను ముందునే వారు గుర్తిస్తారు. నాలెడ్జ్ ఎకానమీ నిర్మాణంలో రోజువారీ లక్ష్యాలను రేపటికి వాయిదావేసే ప్రసక్తే ఉండదు. సోషల్ ఓనర్‌షిప్ పద్దతిలో ఉత్పత్తి, పంపిణీలో సమానన్యాయం ఉంటాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలకు కట్టుబడో లేక పెట్టుబడిదారీ వ్యవస్థ మార్గం ద్వారానో ఈనాడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభించవు. ఇది చాలా స్పష్టమైన విషయం. ఐతే సోషలిస్టు వ్యవస్థ సఫలం కాకుండా ఉండటం కోసమే క్యూబాపై అమెరికా ఆర్థిక దిగ్బంధనం విధించింది. సోషలిస్టు వ్యవస్థ సఫలం కాదని నిరూపించాలన్నదే వారి ఉద్దేశం. అందుకే ఈ ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక చివరిగా చూస్తే ఆగస్టిన్ లాగ్ పుస్తకం ప్రచురితమైన ఎనిమిది సంవత్సరాల తర్వాత 2021లో కొలంబియా లా స్కూలు ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2015 2019 మధ్యకాంలో కూబ్యా నుండి ఎగుమతుల్లో రసాయనిక, సంబంధిత ఉత్పత్తులు 40 శాతం మేరకు తగ్గిపోయాయి. మొత్తం ఎగుమతుల్లో మెడికల్, ఫార్మాస్యూటికల్ ప్రోడక్టులు 90 శాతం మేరకు పెరిగి ఆ లోటు భర్తీ చేశాయి. అంటే బయోటెక్నాలజీ ద్వారా జరిగే ఎతుమతుల ఆదాయం తగ్గిపోయినట్టు కనిపిస్తున్నది.