ఐసిసి తాజా ర్యాంకింగ్స్ ప్రకటన
దుబాయి : ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. ఆదివారంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరిస్ ముగియడంతో ఐసీసీ సోమవారం వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో రెండు రేటింగ్ పాయింట్లు అదనంగా జత చేరడంతో మొత్తంగా విరాట్ కోహ్లీ(886) రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇక, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(868) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఖాతాలో అదనంగా మూడు రేటింగ్ పాయింట్లు వచ్చి చేరాయి. మూడు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ మొత్తంగా 183 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కైవసం చేసుకోగా… మూడో వన్డేలో సెంచరీ సాధించడంతో రోహిత్ శర్మ 171 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. 829 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరిస్‌లో 170 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 21 స్థానాలు ఎగబాకి 50వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 27వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ 229 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 131 పరుగులతో మూడేళ్ల విరామం తర్వాత వన్డేల్లో సెంచరీని సాధించాడు. ఫలితంగా నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలిచాడు. తొలి వన్డేలో సెంచరీ సాధించిన డేవి్‌డ వార్నర్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (764) పాయింట్లతో తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (737) పాయింట్లు సాధించి రెండో స్థానంలో కైవసం చేసుకోగా అఫ్గానిస్థాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ (701) పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ (673) పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ, బుమ్రా టాప్‌లోనే!
RELATED ARTICLES