ఆడిలైడ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత 31 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే.. అయితే ఈ విజయంతో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక టెస్టు విజయాన్ని దక్కించుకున్న తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ మూడు టెస్టులు ఆడింది. అందులో ఒక విజయం సాధించిన టీమిండియా రెండింట్లో ఓడిపోయింది. తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్క విజయాన్నే దక్కించుకుంది. దీంతో ఈ సిరీస్‌ను భారత్ 1- కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో కోహ్లీ ఒక్కడే రాణించడం విశేషం. తాజాగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లీ సారథ్యంలోని భారత్ గెలుపుతో టోర్నీను శుభారంభం చేసింది.
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
RELATED ARTICLES