కోల్‌కతా : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి విమర్శల గుప్పించాడు. కొద్ది రోజులుగా కోహ్లీపై ఈ మాజీ క్రికెటర్ వరుసగా ఫైర్ అవుతూనే ఉన్నాడు. ఇంతకుముందు ఆర్‌సిబి యాజమాన్యానికి కోహ్లీ రుణ పడి ఉండాలని సూచించాడు. ఆర్‌సిబికి ఒక్కసారి కూడా ఐపిఎల్ టైటిల్ అందివ్వని కోహ్లీను మళ్లీ కెప్టెన్‌గా కొనసాగించడం ఆ జట్టు యాజమాన్యం పెద్ద మనుసుకు నిదర్శనమని కోహ్లీపై చురకలు అంటించాడు. ఇప్పుడు తాజాగా ‘నువ్వు ఆర్‌సిబికి మాత్రమే కెప్టెన్‌గా ఉండు.. భారత జట్టుకు వద్దు’ అని ముందే కోహ్లీకి సూచించానని గంభీర్ అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా ఉండటం నిజంగా కోహ్లీ అదృష్టమని పేర్కొన్నాడు. కోహ్లీ ఉత్తమ ఆటగాడు, ప్రపంచంలోనే అతడిని మించిన బ్యాట్స్‌మన్ లేరు. ఆ విషయంలో నేనూ ఏకీభవిస్తా.. కానీ కెప్టెన్సీలో మాత్రం కోహ్లీ మరింత నేర్చుకోవాలని అన్నాడు. ఏడు సంవత్సరాలు పాటు ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఒక్కసారి కూడా కప్పు గెలిపించలేదని గుర్తు చేశాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరు వరుస ఓటములు గురించి మాట్లాడుతూ.. ‘ఆ ఓటములు నన్నెంతో బాధించాయి. ఏడేళ్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాణం పెట్టి ఆడాను. జట్టుకు ఆ పేరు తీసుకొచ్చేందుకు మేమెంతో శ్రమించాం. మనస్ఫూర్తిగా కష్టపడ్డాం.. అందుకే రెండు సార్లు ఛాంపియన్‌లుగా నిలవడంతో పాటు మూడు సార్లు ప్లే ఆఫ్‌కు కూడా చేరుకోగలిగాం’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఇటివలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్ రాజకీయంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి బిజెపి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కోహ్లీపై గంభీర్ మళ్లీ ఫైర్
RELATED ARTICLES