సిడ్నీ: పరుగుల యంత్రం, ఛేజింగ్ కింగ్, భారత సారథి విరాట్ కోహ్లిని తమ బౌలర్లు కట్టడి చేయగలరని ఆస్ట్రేలియా సారథి టిమ్ పైనీ అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబరు 6 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా జరిగే ఈ టెస్టుకు తమ ఆటగాళ్లంతా సన్నద్ధమవుతున్నారని, వారు భారత బ్యాట్స్మెన్లను ఇబ్బందికి గురి చేయగలరని టిమ్ పేర్కొన్నాడు. ‘నైపుణ్యం పరంగా చూసుకుంటే మా బౌలర్లు కోహ్లీని కచ్చితంగా ఇబ్బంది పెట్టగలరు. మేం అతిగా భావోద్వేగానికి గురైతే ఆటలో పదును తగ్గుతుంది. అందుకే మేం లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసరాల్సి ఉంది. కసిగా బంతులు వేయాలన్న ఉద్దేశంతో బౌలర్లు ఉద్రేకానికి గురవుతారు. కానీ మేం పక్కా ప్రణాళికలు అమలు చేస్తామని పైనీ అన్నాడు.
కోహ్లిని కట్టడి చేస్తాం: టిమ్ పైనీ
RELATED ARTICLES