హైదరాబాద్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా సిద్దిపేట జిల్లా చినకొండూరు మండలం కొచ్చగుట్ట గ్రామాన్ని అధికారులు ఎలా ఖాళీ చేయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేయించారో తెలియజేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా చినకొండూరు మండలం కొచ్చగుట్ట గ్రామంలోని ఇళ్లను అర్ధరాత్రి వేళ ఖాళీ చేయించడంపై బాధితురాలు ఇ.మంగవ్వ ఇతరులు వేసిన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పునరావాస, పునర్నిర్మాణ పథకాన్ని అమలు చేసే వరకూ అనంతగిరి రిజ ర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయరాదన్న హైకోర్టు ఆర్డర్‌ను అధికారులు ఖాతరు చేయలేదని పిటిషనర్ లాయర్ వాదించారు. మెమో కాపీ అందలేదని ఏజీ చెప్పారు. దీంతో హైకోర్టు..బాధితులకు కలెక్టర్ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ఇళ్లను ఖాళీ చేయడం, కూల్చివేయడంపై 24లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది
కోర్టు చెప్పినా…ఆ గ్రామాన్ని ఖాళీ చేయిస్తారా?
RELATED ARTICLES