మరో ఏడు మండలాలు కూడా..
ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
అభ్యంతరాల స్వీకరణకు 30రోజుల గడువు
ఇప్పటికే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్తయిన ప్రాథమిక నోటిఫికేషన్ ప్రక్రియ
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, జగిత్యాల జిల్లాలో కోరుట్లను రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటి లో కలిసే మండలాల వివరాలతో ప్రాథమిక నోటిఫికేషన్ పబ్లిష్ చేసి అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ గురువారం ఉత్తర్వు లు జారీచేశారు. అభ్యంతరాల స్వీకరణకు 30రోజుల గడువు ఇచ్చారు. ఇటీవల అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వీటి ఏర్పాటుకోసం స్థానికుల నుంచి డిమాండ్ వచ్చింది. ప్రచారపర్వంలో భాగం గా అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని ఏర్పాటుచేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వీటితో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుచేయాలని కూడా డిమాండ్లు వచ్చా యి. వీటి ఏర్పాటుచేసే దిశగా రెవెన్యూ శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల భౌగోళిక స్వరూపం, వాటిలో ఉండాల్సిన మండలాలు వంటి వివరాల సేకరణ పూర్తయింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెండు కొత్త జిల్లాలు, రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగం గా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ను అధికారులు పూర్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిన వాటిలో నాగర్కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్, జగిత్యా ల జిల్లాలో కోరుట్ల రెవెన్యూ డివిజన్లు ఉన్నా యి. కొత్తగా ఏర్పాటు అవుతున్న కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధి లో ఉంది. ప్రస్తుతం నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజన్ నుంచి కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడే ర్, పెంట్యావెల్లి మండలాలను వేరు చేసి వీటి తో కొల్లాపూర్ రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కోరుట్ల ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. ఈ రెవెన్యూ డివిజన్ నుంచి కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలను వేరు చేసి వీటితో కొత్తగా కొరుట్ల రెవెన్యూ డివిజన్ను ఏర్పాటుచేస్తున్నారు. గురువారం నుంచి 30 రోజుల్లోపూ ఈ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పూర్తయి అమల్లోకి రావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.