హెలికాఫ్టర్ ప్రమాదంలో బ్రియాంట్‌తో పాటు కూతురు, తొమ్మిది మంది సిబ్బంది మృతి
లెజెండరీ బాస్కెట్ బాల్ ప్లేయర్ మరణంతో శోకసంద్రంలో అభిమానులు
న్యూయార్క్ : అమెరికా లెజెండరీ బాస్కెట్ బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తె గియానా హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరితో పాటుగా మిగతా సిబ్బందితో సహా ఇంకా 9 మంది మరణించారు. అయితే కోబ్ బ్రియాంట్ మరియు అతని కుమార్తెల మృతదేహాల్ని అధికారులు గుర్తించగా మిగతావారిని గుర్తించడం కష్టంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొబ్ బ్రియాంట్ మరణంతో క్రీడా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని మృతికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు. కోబ్ బ్రియాంట్ బాస్కెట్ బాల్ క్రీడలో తన 20 ఏళ్ల కెరీర్‌లో పలు రికార్డులని సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. 18 సార్లు ఆల్ టైం స్టార్‌గా నిలిచారు. 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ తరపున ఆడిన అతను రెండు స్వర్ణ పథకాలు సాధించారు. ‘బ్లాక్ మాంబా’గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దిగ్గజ ఆటగాడు. బ్రియాంట్, అతడి కుమార్తె మరణ వార్త తెలిసి షాక్‌కి గుర య్యామని ,ప్రపంచ స్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు అంటూ ట్వీట్ చేశారు.
2012లోనే చెప్పాడు..
అయితే ప్రస్తుతం బ్రయంట్ మరణంకు సంబందించిన ఓ వైరల్ ట్వీట్ కూడా అంతే షాక్‌కు గురిచేస్తోంది. ’బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడు’ అని డాట్ నోసో అనే ఓ ట్విట్టర్ యూసర్ 2012, నవంబర్ 14న ఓ పోస్ట్ చేసాడు. యాదృచ్చికంగా బ్రయంట్ అదే విధంగా తన ప్రాణాలను కోల్పోయాడు. 7 సంవత్సరాల క్రితం నోసో ఈ ట్వీట్ చేసాడు. సోమవారం తెల్లవారుజామున బ్రయంట్ మరణ వార్త తెలియడంతో నోసో ఈ పోస్టుపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రయంట్ అభిమానులు డాట్ నోసో జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నోసో చేసిన ఈ ట్వీట్ నిజమైన ట్వీటేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నోసో చెప్పినట్టే బ్రయంట్ మరణించడం విశేషం. బ్రయంట్ మృతిచెందడానికి కొన్ని గంటల ముందు లీబ్రాన్ జేమ్స్‌ను కొనియాడుతూ ఓ ట్వీట్ చేసారు. ఇదే ఆయన చివరి ట్వీట్. ’నన్ను అధిగమించిన నా సోదరుడికి అభినందనలు. నా సోదరుడి పట్ల చాలా గౌరవం ఉంది. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్ జేమ్స్’ అని ట్వీట్ చేశారు. #33644 అనే హ్యాష్ టాగ్ కూడా జత చేసారు. అమెరికా నేషనల్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో మూడో స్థానంలో బ్రియాంట్ ఉండగా.. తాజాగా లీబ్రాన్ జేమ్స్ అతన్ని అధిగమించాడు. చివరి ట్వీట్‌కు 1.9 మిలియన్ లైకులు వచ్చాయి. కొబ్ బ్రయంట్ బాస్కెట్‌బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. గతంలో ఫోరబ్స్ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నారు. బాస్కెట్‌బాల్ చరిత్రలో తన కంటూ బ్రయంట్ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నారు. అయిదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచారు. 2008, 2012 ఒలింపిక్స్‌ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా దిగ్గజం 2016లో రిటైర్మెంట్ ప్రకటించారు.
గ్రామీ అవార్డుల్లో నివాళి..
కొబ్ బ్రయాంట్ దుర్మరణంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది క్రీడాకారులతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సంతాపాన్ని తెలిపారు. తాజాగా, లాస్ ఏంజెల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో జరుగుతున్న గ్రామీ అవార్డుల్లో మ్యూజిషియన్స్ కొబ్ బ్రయాంట్‌కు నివాళులు అర్పించారు. ఇదే స్టేపుల్స్ సెంటర్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. గ్రామీ అవార్డుల కార్యక్రమం ప్రారంభానికి ముందు పాప్ స్టార్ లిజ్జో ‘Cuz I Love You‘, ‘Truth Hurts‘లను ప్రదర్శించడానికి ముందు ‘ఈరాత్రి కోబ్ కోసం‘ అని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మనమందరం ప్రస్తుతం బాధను అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు లాస్ ఏంజిల్స్, అమెరికా ఒక హీరోని కోల్పోయింది. కోబ్ బ్రయాంట్ నిర్మించిన ఇంట్లోనే మనందరం హృదయపూర్వకంగా నిలబడి ఉన్నాం‘ అని చెప్పుకొచ్చింది. కాగా, ఈ కార్యక్రమంలో ఆరు గ్రామీ అవార్డులకు ఎంపికైన లాస్ ఏంజిల్స్ టీన్ పాప్ స్టార్ బిల్లీ ఎలిష్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో బ్రయాంట్‌తో అతడి కుమార్తె జియానా మాట్లాడుతున్న ఫోటోను పోస్టు చేసి ‘Uggghhhhhhhhh‘ అని కామెంట్ పెట్టాడు. మరోవైపు గ్రామీ నామినీ కామిలా కాబెల్లో కూడా బ్రయాంట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి… తాను బాస్కెట్‌బాల్ అభిమాని కాకపోయినప్పటికీ అతడి జీవితం ఆధారంగా తీసిన ‘మ్యూస్’ అనే డాక్యుమెంటరీని పోస్టు చేసి బాధాకరమైన సమయం వచ్చిందని రాసుకొచ్చింది. ‘నేను అతడి ప్రతి ఇంటర్వ్యూను చూశాను, కోచ్ చెప్పిన ప్రతి కోట్ చదివాను. అతను నన్ను ఎన్నిసార్లు రక్షించాడో, నేను సొంతంగా ఓ ఛాంపియన్‌ను యాక్సెస్ చేయడానికి ఎన్నిసార్లు అతను నాకు సహాయం చేశాడో నాకు తెలుసు‘ అని ఆమె తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.
కోబ్ దుర్మరణం
RELATED ARTICLES