సచివాలయంలో గుట్టలుగా పేరుకుపోతున్న దస్త్రాలు
దాదాపు లక్షకు చేరువగా ఫైళ్లు పెండింగ్?
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన, జరుగబోతున్న వరుస ఎన్నికలు పాలనాయంత్రాంగంపైనా ప్రభావం చూపనున్నాయా? శానస సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఫైళ్లు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి? ఆర్థిక పరమైన ఫైళ్లను అధికారులు క్లియరెన్స్ చేయడానికి ఎన్నికల కోడ్‌ను అధికారులు బూచిగా చూపుతున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2018 సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని కేబినెట్ ఆమోదంతో గవర్నర్‌కు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తదుపరి నూతన ప్రభుత్వం ఏర్పాటై కొత్త సచివులు కొలువుదీరినప్పటికీ కీలకమైన ఫైళ్లు మాత్రం ఇంకా క్లియర్ కావడం లేదు. అందులోనూ సాక్షాత్తూ సచివాలయంలోనే ఇలాంటి పెండిం గ్ ఫైళ్లు దాదాపు లక్ష వరకు చేరువగా ఉంటాయని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఫైళ్లు పెట్టేందుకు బీరువాలు, అల్మారాలు కూడా చాలడం లేదు. వాటి పైనా, కిందా పెట్టినా స్థలం చాలక ఏకంగా కార్యాలయం కారిడార్ గోడలకు ఆనుకుని పెట్టాల్సి వస్తోంది. కొన్ని ఫైళ్లను గుడ్డలతో కట్టి భద్రపరుస్తుండగా, మరి కొన్నింటినీ ఒకదానిపై ఒకటి పేరుస్తూ సచివాలయ కార్యాలయ స్థలాన్ని దాటి బయటి దాకా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాక్షాత్తూ పరిపాలనకు కేంద్రబిందువైన సచివాలయంలోనే పెండింగ్ ఫైళ్ల పరిస్థితి గోడలు దిగి కారిడార్లకు వస్తే ఇక జిల్లాల్లో పరిస్థితి ఏలా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదంటున్నారు విశ్లేషకులు.
కోడ్ ఎఫెక్టేనా..!!
RELATED ARTICLES