HomeNewsTelanganaకోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరాకూ నీళ్లందలే

కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరాకూ నీళ్లందలే

బిఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతి చూస్తే కడుపు తరుక్కుపోతోంది
‘సీతారామ’ను రూ.18,500 కోట్లకు పెంచినప్పటికీ ఆయకట్టు లేదు
డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క
ప్రజాపక్షం/హైదరాబాద్‌ గత బిఆర్‌ఎస్‌ హయాంలో నీటి పారుదల ప్రాజెక్ట్‌ అంశంలో జరిగిన అవినీతిని చూస్తే కడుపు తరుక్కుపోతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ. 1552 కోట్లతో పూర్తి కావాల్సిన రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్ట్‌లకు రీడిజైనింగ్‌ పేరుతో ఏడు, ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు అందించలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ దుమ్మగూడెంలోని రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ 1681 కోట్లు అంచనా ఉండగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ 889 కోట్లు ఖర్చు పెట్టిందని, మరో రూ. 792 కోట్లు బ్యాలెన్స్‌ ఉన్నదని, అలాగే ఇందిరాసాగర్‌ ప్రాజెక్ట్‌కు రూ. 1824 కోట్ల అంచనా వేయగా, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం రూ. 1064 ఖర్చుపెట్టిందని, మరో రూ. 760 కోట్లు బ్యాలెన్స్‌ ఉన్నదని, ఈ రెండు కలిపి 1552 కోట్లు ఖర్చు చేసి ఉంటే మూడున్నర లక్షల ఆయకట్టుకు నీరు అందేదని వివరించారు. రీడిజైన్‌ పేరుతో సీతరామా ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచినప్పటికీ అదనంగా ఆయకట్టు లేదన్నారు. ఈ నిధులన్నీ ఎక్కడకి పోయాయని,ఆలోచన చేస్తేనే కడుపు తరుక్కుపోతుందన్నారు. ఈ దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆరోపించారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments