తాజాగా సేకరించిన రుణం రూ.10 వేల కోట్లు
అత్యధికంగా పాలమూరు రంగారెడ్డికే కేటాయించాలని నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు కోటి ఎకరాలకు సాగు నీరందించాలంటే మరో రూ.లక్ష కోట్లు వెచ్చించాల్సిందే. ఇదీ నీటి పారుదల శాఖ అధికారులు తేల్చిన లెక్క. లక్ష కోట్లు రూపాయలు వెచ్చిస్తే తప్ప రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులు పూర్తి కావు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.1.15లక్షల కోట్లు వెచ్చించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వివిధ బ్యాం కుల నుంచి రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం కూడా బడ్జెట్‌లో ప్రాజెక్టుల పనులకు కేటాయించింది చాలా తక్కువ. అప్పులు చేసే ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ఇప్పటికే బోలెడు అప్పులు ఇచ్చిన బ్యాంకులు మళ్లీ ఇప్పుడు రూ. లక్ష కోట్లు ఇస్తాయా అన్నదే సర్కారు ముందున్న అసలు సమస్య. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించుకున్న కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే రూ.లక్ష కోట్లు తప్పనిసరి అని ఇంజినీర్లు తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో మొత్తం 38 భారీ, మధ్య తరహా ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టారు. వీటి పూర్తికి మొత్తం రూ. 2.19 లక్షల కోట్లు అవసరం. ఇందులో ప్రభు త్వం ఇప్పటికే రూ.1.15లక్షల కోట్లు ఖర్చు చేయ గా మరో రూ.1.04లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఒక్క కాళేశ్వరంపైనే ఇప్పటి వరకు రూ.55 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగం గా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు రోజుకు ఒక టిఎంసి నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేలా పనులు పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుల కోసం వివిద కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణ ప్రక్రియను ప్రారంభించగా ఇప్పటి వరకు రూ.10వేల కోట్లు రుణాలు సేకరించారు..అనుకున్న విధంగా పనులు చేయగలిగితే వచ్చే ఏడాదికి దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని ప్రభు త్వం భావిస్తోంది.అయితే ప్రభుత్వం పాలమూ రు ఈ సారి బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం ఏమూలకూ సరిపోదు. అందుకు సేకరించిన రూ.10వేల కోట్ల రుణం నుంచి అత్యధికంగా పాలమూరుకే వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు పూర్తయిన,అంతకు ముం దు నుంచే ఉన్న ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ప్రస్తు తం 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా రు. కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా…నిజానికి లక్ష్యం 1.24 కోట్ల ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టుల పనులు చేపట్టారని అధికారులు చెబుతున్నారు.వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్తగా దాదాపు 17లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి ప్రాజెక్టులకు విశేష ప్రాధాన్యమిచ్చి పనులు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు మరో 13 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.అంటే చేపట్టిన పనుల మేరకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 53 లక్ష ల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొత్తం సాగునీటి పారుదల పనుల కోసం ఇప్పటి వరకు రూ.80వేల కోట్లు ఖ ర్చు చేసింది. వీటిలో కొత్త ప్రాజెక్టుల పనులతో పా టు పాత వాటి పునరుద్ధరణ పనులు ఉన్నాయి.