ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న మార్కెట్ అకాల వర్షానికి కూలిపోయింది
ప్రజాపక్షం/ రంగారెడ్డి : ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రులు చెప్పిన మూన్నాళ్లకే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొహెడలో తాత్కాలికంగా నిర్మిస్తున్న మామిడి పండ్ల మార్కెట్ సోమవారం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సహచరులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బలంగా వీసిన గాలివానకు అక్కడ ఏర్పా టు చేసిన తాత్కాలిక షెడ్లు పూర్తిగా కూలిపోవడంతో అక్కడున్న రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు అక్కడనుంచి పరుగులు తీశారు. 20 నిమిషాలపాటు ఏకధాటిగా కురిసిన గాలివానతో షెడ్లపై ఉన్న రేకులన్నీ లారీలపై పడ్డాయి. ఈదురుగాలులకు మార్కెట్‌లో ఉన్న ఓ లారీ సైతం బోల్తా పడింది. కాగా, ఈ మార్కెట్ ని పాతిక రోజుల వ్యవధిలోనే రెండు సార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నర్సింహాగౌడ్‌ల ఆద్వర్యంలో పర్యవేక్షించారు. తాత్కాలికంగా నిర్మిస్తున్న షెడ్లు నాణ్యత లేవని ప్రతిపక్షాలు పదే పదే మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను స్వీకరించి, పనుల నాణ్యతను పరిశీలించాల్సిన మంత్రులు, ఎంఎల్‌ఎలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న విమర్శలుగా కొట్టిపారేశారు. ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా ప్రశ్నించినా కరోనా వ్యాప్తి నివారణకు మార్కెట్‌ను తక్షణం తరలించాలన్న ఆతృత తప్ప, నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారు. ఆ నిర్లక్ష్యం నేడు ప్రాణాపాయానికి దారితీసింది. కాగా, కాంట్రాక్టులు నాసి రకంగా పనులు చేయడంతోనే కొద్దిపాటి గాలివానకే షెడ్లు కుప్పకూలాయని రైతులు,వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి అద్దం పడుతుందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపించారు. మార్కెట్‌ను సందర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సిపిఐ నాయకులు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, మాట్లాడుతూ ఎలాంటి మౌలిక వసతు లు లేకుండా హడాహుడిగా కొత్తపేట నుండి కొహెడకు తరలించడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. ప్రభుత్వం నైతిక భాధ్యత వ హించాలని, బాధ్యులపై చ ర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తమ స్వార్థ ప్ర యోజనాలకోసం పండ్ల మార్కెట్‌ని హడావిడి గా తరలించి ప్రజల ప్రాణాలకు హాని కలిగే పద్ధతుల్లో షెడ్ల నిర్మాణం చేశారని ఓరుగంటి అన్నారు. మార్కెట్ షెడ్లు కుప్పకూలడంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వా రికి ఎలాంటి షెరతులు లేకుం డాఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
కొహెడ మార్కెట్ కుప్ప కూలింది
RELATED ARTICLES