హైదరాబాద్: తెలంగాణ శాసనసభ గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదట ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 114 మంది సభ్యులు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ వీరందరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, టిఆర్ఎస్ సభ్యుడు మాధవరం కృష్ణారావు, టిడిపి సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ ఇంకా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.
అయితే ప్రొటెం స్పీకర్ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని బిజెపి గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ తెలిపారు. ఎంఐఎం సిద్ధాంతాలు వేరు… తమ సిద్ధాంతాలు వేరని ఆయన అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ఈఅంశాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు.
కొలువుదీరిన శాసనసభ… రేపటికి వాయిదా
RELATED ARTICLES