రేపటి కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
పురపాలక చట్టంపై చర్చించేందుకేనంటూ ప్రచారం
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్నాయి. కొత్త పురపాలక చట్టం తీసుకువచ్చేందుకే అసెంబ్లీని సమావేశ పరుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న జరుగనున్న కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరీ ముఖ్యంగా మంత్రివర్గ సమావేశంలో పురపాలక చట్టం అంశంతో పాటు పాలనా పరమై న మరిన్ని అంశాలు ప్రస్తావనకు రానున్నాయని అంటున్నారు. కొత్త సెక్రటేరియెట్ డిజైన్ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఫలానా డిజైన్ పరిశీలనలో ఉందంటూ ఇప్పటి వరకు రెండు డిజైన్లను ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకుని వచ్చింది. వీటిలో హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన పాత డిజైన్ కాగా, కాచిగూడ రైల్వేస్టేషన్ నమూనాను పోలి ఉండేలా నూతనంగా ఇటీవలే మరో డిజైన్ తెరమీదికి వచ్చింది. ఇందులో సిఎం కెసిఆర్ నూతన డిజైన్ వైపే మొగ్గు చూపవచ్చని అత్యంత విస్వసనీయ వర్గాల ద్వారా తెలియ వచ్చింది. ఈ రెండు డిజైన్లు కూడా ఒకే వైపునకు ముఖ ద్వారాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు డిజైన్లలో కొత్తగా తెరమీదికి వచ్చిన నమూనానే వాస్తు పరం గా బాగా ఉంటుందని వాస్తు పండితులు సిఎంకు సూచించినట్లు చెబుతున్నారు. ఈ రెండింటిలో ముఖ్యమంత్రి మదిలో ఉన్న డిజైన్ ఏది? కేబినెట్ సహచరులతో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. కొత్త సచివాలయం కోసం శంకుస్థాపన కూడా చేసిన తర్వాత ఇంకా డిజైన్ల దగ్గరే సమయం వృథా చేయకుండా సిఎం తాను అనుకున్న డిజైన్‌కు తుది రూపు ఇస్తారని, దీనికి ఈ కేబినెట్ సమావేశం వేదిక కావచ్చని రోడ్లు భవనాల శాఖ అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆధ్యాత్మిక పరంగానూ నూతన సచివాలయంలో హిందూ, ముస్లిం, క్లిస్టియన్స్ కోసం ఆలయం, మసీదు, చర్చిని నిర్మించనున్నారు. స మీకృత సచివాలయం నిర్మిస్తే ఇప్పుడున్న నల్లపోచమ్మ దేవాలయం, మసీ దు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ఏం చేయాలి? గుడి అలాగే ఉంచితే చు ట్టూ పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసి ఎలివేషన్‌లో కలుపడం ఒకటి అయితే, ప్రస్తుతం ఉన్న చోట నుండి తొలగించి వాస్తుకు అనుగుణంగా నూతన స్థలంలోనే నిర్మించాలన్నది నూతన ప్రతిపాదనలో ఉన్నట్లు చెబుతున్నారు. మసీదు కూడా కొత్తదే కావడం, నిర్మాణంలో ఎలాంటి దోషాలు లేక పోవడంతో దీన్ని వీలైనంత వరకు తొలగించవద్దని కూడా ముస్లిం మత పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇవన్నీ సాకారం చేసుకునేందుకు ప్రస్తుతం ఉ న్న ఎలివేషన్‌ను చతురస్రాకారంలోకి తీసుకుని రావాలని, ఇందుకోసం మి ంట్ కాంపౌండ్‌ను సెక్రటేరియట్‌కు కలుపుకోవాలని పలువురు సూచించినట్లు తెలిసింది. సచివాలయం వెనుక వైపు భాగమైన మింట్ కాంపౌండ్‌లో ని విద్యుత్‌శాఖ కార్యాలయాలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల కార్యాలయాలు ఉన్న విషయం తెలిసిందే. సెక్రటేరియెట్ భూమిగా పరిగణించేలా ఈ కార్యాలయాలను త్వరగా ఖాళీ చేయించి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను సిఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.