HomeNewsBreaking Newsకొత్త లేబర్‌ కోడ్స్‌తో జర్నలిస్టులకు సంకెళ్లు

కొత్త లేబర్‌ కోడ్స్‌తో జర్నలిస్టులకు సంకెళ్లు

పాత చట్టాల రద్దుతో వేతన, పని పరిస్థితులిక దుర్భరం
కేంద్ర కార్మికమంత్రికి జర్నలిస్టు ప్రతినిధివర్గం వినతిపత్రం
న్యూఢిల్లీ :
వర్కింగ్‌ జర్నలిస్టులకు సంబంధించిన రెండు పాత చట్టాలను రద్దుచేయడంవల్ల కొత్త లేబర్‌కోడ్స్‌ ద్వారా జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, వారి పని పరిస్థితు లు, వేతనాలు దుర్భరంగా మారిపోతాయని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐజెయు సహా జర్నలిస్టుల సంఘాల ప్రతినిధివర్గం కేంద్ర కార్మికశాఖామంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. కొత్త లేబర్‌ కోడ్స్‌ వల్ల మీడిమా యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై దేశంలో జర్నలిస్టులు పనిచేయవలసిన పరిస్థితులు వస్తాయని శనివారం న్యూఢిల్లీలో మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ప్రతినిధివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాల ద్వారా దేశంలో జర్నలిస్టులకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక నిబంధనలన్నీ రద్దు కావడంవల్ల లేబర్‌ కోడ్స్‌ అమలువల్ల భవిష్యత్‌లో ఇక జర్నలిస్టులు ఒక సామాన్య కార్మికుడి తరహాలోనే పరిగణించబడే దుర్భర పరిస్థితులు తలెత్తుతాయని ప్రతినిధి వర్గం మంత్రికి తెలియజేసింది. జర్నలిస్టుల సృజనాత్మక రచనా వ్యాసంగ ప్రక్రియ ప్రత్యేక లక్షణాలను కొత్త లేబర్‌ కోడ్స్‌ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వారిని అతి సామాన్యమైన కార్మికుడిగా పరిగణించడంవల్ల వారందరూ ఇతర పరిశ్రమల్లో ఉండే సాధారణ కార్మికుడిస్థితికి చేరి యాజమాన్య దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన గడ్డుపరిస్థితులు దాపురిస్తాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. రాజ్యాంగంలోకి 19(1) (ఎ) అధికరణ పరిధిలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల రచనా వ్యాసంగ స్వేచ్ఛ పరిరక్షణకు ఒక చట్టం అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా చెప్పిన విషయాన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ దృష్టికి తెచ్చారు. జర్నలిస్టుల స్వేచ్ఛకు పూర్తి భరోసా ఇచ్చి వారికి రక్షణలు కల్పించే ఆరు అతిముఖ్యమైన మూల సూత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉద్ఘాటించి చెప్పిన విషయాన్ని కూడా కేంద్రమంత్రికి తెలియజేశారు. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇస్తున్న విధంగానే సీనియర్‌ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ చెల్లించే విషయాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ప్రెస్‌ అసోసియేషన్‌, వర్కింగ్‌ న్యూస్‌ కెమేరామెన్స్‌ అసోసియేషన్‌, ఇడియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) ప్రతినిధివర్గం కేంద్రమంత్రిని కలిసింది. ఐజెయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, బల్వీందర్‌ సింగ్‌ జమ్ము, ప్రెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సి.కె.నాయక్‌, కోశాధికారి లక్ష్మీదేవి, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు జైశంకర్‌ గుప్తా, వర్కింగ్‌ న్యూస్‌ కెమెరామెన్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యున్‌సిఎ) అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.సిన్హా, ప్రధాన కార్యదర్శి సందీప్‌ శంకర్‌ ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. 1955 నాటి వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఇతర ఉద్యోగుల సర్వీసు నిబంధనలు), మిసిలీనియస్‌ ప్రావిజన్‌ యాక్ట్‌, 1958 నాటి వర్కింగ్‌ జర్నలిస్టుల (వేతనాల నిర్ణయం) చట్టం రద్దుచేయడంవల్ల దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన పరిస్థితులను ప్రతినిధివర్గం కేంద్రమంత్రి దృష్టికి తెచ్చింది. “జర్నలిస్టుల విధినిర్వహణలో పనిగంటలు డబ్ల్యుజెఎ చట్టం కింద ఆరు గంటలు, రాత్రి పనివేళలు ఐదున్నర గంటలు ఉండగా, కొత్త లేబర్‌ కోడ్స్‌ వల్ల ఇతర పారిశ్రాకమిక కార్మికుల తరహాలోనే జర్నలిస్టులకు కూడా పని గంటలు నిర్దేశించింది. వేతనబోర్డులు జర్నలిస్టులకు ప్రత్యేక నిబంధనలు సమకూర్చాయి. వాటిద్వారా వారికి వేతనాలు చెల్లిస్తునాయి.కొత్త లేబర్‌ కోడ్స్‌ వల్ల యాజమాన్యాలు స్వేచ్ఛగా వేతనాల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులను ఇష్టమైన విధంగా పనిలోకి తీసుకోవచ్చు, లేదా వెళ్ళగొట్టవచ్చు. మీడియా కంపెనీలు ఏకపక్షంగా సర్వీసు నిబంధనలు విధించేందుకు స్వేచ్ఛ కొత్తకోడ్స్‌ వల్ల లభించింది. కొత్త లేబర్‌ కోడ్స్‌ జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేశాయి” అని జర్నలిస్టుల ప్రతినిధి వర్గం వినతిపత్రంలో పేర్కొంది. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రతినిధివర్గం చెప్పిన విషయాలను ఓపికగా ఆలకించి, తన మంత్రిత్వశాఖ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన సస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రెస్‌ అసోసియేషన్‌, వర్కింగ్‌ న్యూస్‌ కెమేరామెన్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ సంయుక్తంగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments