ప్రజాపక్షం/ సిద్దిపేట ప్రతినిధి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బిఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం సూరంపల్లిలో సోమవారం జరిగింది. దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపి అయిన ప్రభాకర్‌రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫాస్టర్‌ను పరామర్శించి తిరిగి వస్తున్న క్రమంలో మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గట్టాని రాజు ఎంపి ప్రభాకర్‌రెడ్డితో కరచాలనం చేసి, పోటో దిగుతానని దగ్గరికి వెల్లి హఠాత్తుగా కత్తితో కడుపులో పోడిచాడు. దీంతో అక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తరువాత వెంటనే తేరుకున్న నాయకులు, కార్యకర్తలు దాడిచేసిన గట్టన రాజును పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్‌రెడ్డికి తీవ్ర రక్తస్త్రావం అవుతుండటంతో కట్టుకట్టి చికిత్స నిమిత్తం ముందుగా గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఎంపి ఫ్రభాకర్రెడ్డిని పరామర్శించేందు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్ ఆసుపత్రికి పెద్దఎత్తున తరలివచ్చారు, గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఎంపి పరామర్శించిన మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సిఎం కెసిఆర్ ఆశీర్వాద సభకు వెళ్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపి ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారని విషయం తెలుసుకొని హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందుతున్న ఎంపి ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం- : శ్వేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గట్టన రాజుపై కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపి ప్రభాకర్‌రెడ్డిపై గట్టన రాజు ఎందుకు దాడి చేశారు? అసలు రాజు ఎవరు? వ్యక్తిగతంగా దాడి చేశారా? రాజకీయాలు, ప్రతిపక్షలా ప్రమేయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజుపై కేసు మోదు చేసి అన్ని కోణాల్లో విచారణ భాతున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడించారు.
ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. నాపై జరిగినట్లుగానే భావిస్తా: కెసిఆర్
మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సిఎం కెసిఆర్ స్పందించారు. ‘మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త! పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం. చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం. మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే.. మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు. ఇది రాజకీయమా?” అని కెసిఆర్ ప్రశ్నించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న సిఎం మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సిఎం ఆరా తీశారు.
ఆసుపత్రిలో పరామర్శ
కాగా, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పరామర్శించారు. నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం నేరుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి సిఎం వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సిఎంకు వైద్యులు వివరించారు. మరోవైపు, కొత్త ప్రభాకర్ రెడ్డికి శస్త్ర చికిత్స ముగిసింది. పేగుకు గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకకుండా ఐసీయూలో ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. శస్త్ర చికిత్స సమయంలో గాయం తీవ్రంగా ఉందని వైద్యులు గుర్తించారు.
కొత్త ప్రభాకర్రెడ్డిపైకత్తితో దాడి
RELATED ARTICLES