న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉదయం 07:15 గంటల నుండి ప్రారంభమైంది. 9 గంటలకు స్పీకర్ చాంబర్ సమీపంలో రాజదండాన్ని ప్రధాని ప్రతిష్టించారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌సహా మొత్తం 19 పార్టీలు బహిష్కరించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రు లు హాజరయ్యారు. కొత్త పార్లమెంట్ భవనా న్ని రాష్ట్రపతితో ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. కొత్త లోక్ సభ చాంబర్ భారతదేశ జాతీయపక్షి నెమలి మాదిరిగా నిర్మించారు. కొత్త రాజ్యసభ చాంబర్‌ను జాతీయ పుష్పం కమలం పోలి ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ చాంబర్‌లు, ఆశోక్ చక్ర నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని ఇండోర్ నుండి తెచ్చారు. ఆశోక్ చక్ర చిహ్నం కోసం అవసరమైన సామాగ్రిని ఔరంగాబాద్ , జైపూర్ నుండి సేకరించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
పెరగనున్న పార్లమెంటు సీట్లు?
పార్లమెంటు సీట్లు త్వరలోనే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, పార్లమెంటు స్థానా లు పెరగనున్న నేపథ్యంలో, సరికొత్త భవనం అవరమని వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీట్ల పెంపు పై సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అంటున్నారు. ఇలావుంటే, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రధాని అభివర్ణించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ భవనాన్ని ప్రారంభించిన మోడీ మాట్లాడుతూ, ఇది దేశ ప్రజలంతా గర్వంతో ఉప్పొంగిపోయే తరుణమని అన్నారు. సాధికారతకు కేంద్రంగా, కలల సాకారానికి స్ఫూర్తినిచ్చే సాధనంగా పేర్కొన్నారు. మన దేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడుతుందని అన్నారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం
RELATED ARTICLES