మరో నలుగురు మృతి
రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమో దు కాగా, మరో నలుగురు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 92కి పెరిగింది. తాజా కేసుల్లో 87 కేసులు స్థానికంగా నమోదైనవే. మంగళవారంనాడు వలసకార్మికులు, ప్రవాసులకు సంబంధించి 12 కేసులు నమో దు అయ్యాయి. జిహెచ్‌ఎంసితోపాటు వివిధ జిల్లాల్లో కొవిడ్ 19 లక్షణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా న మోదైన 99కరోనా కేసుల్లో 7౦ కేసులు గ్రే టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనివే. మిగిలిన కేసుల్లో మేడ్చల్‌లో 3, మెదక్, నల్లగొండలో 2, రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒకొక్క కేసు చొప్పున నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2891కు చేరుకోగా, ప్రస్తుతం 1526 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 1273 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా 99 కేసులు
RELATED ARTICLES