రాష్ట్రంలో 1634కి పెరిగిన కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభా వం రోజురోజుకీ పెరుగుతోంది. మంగళవారంనాడు కొత్తగా 42 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 34 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరో 8 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు సంబంధించినవి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1634కి పెరిగింది. కాగా మంగళవారం నాడు మరో 9 మందిని డిశ్చార్జి చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 585 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 38 ఉండగా, ఇప్పటివరకు 1011 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 77 మంది వలస కార్మికులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలు నేటికీ కరోనా రహిత జిల్లాలుగానే కొనసాగుతున్నాయి.
కొత్తగా 42 కేసులు
RELATED ARTICLES