యుద్ధవిమానాల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదముద్ర
రూ.85 వేల కోట్లతో జెట్స్, సబ్‌మెరైన్స్ సేకరణ
పారిస్‌లో నేడు మోడీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫ్రాన్స్ పర్యటన ప్రారంభించిన గురువారంనాడే కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుండి దిగుమతి చేసుకునేందుకు 26 రాఫెట్ జెట్ యుద్ధ విమానాలు, మరో మూడు జలాంతర్గాముల సేకరణకు అనుమతులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. శుక్రవారంనాడు ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేట్ మేకక్రాన్‌తో పారిస్‌లో విస్తారమైన పలు అంశాలపై ముఖాముఖీ చర్చలు చేస్తారు. రాఫెల్ జెట్ యుద్ధ విమానాలు, జలాంతర్గాముల సేకరణకు రూ.80,000 నుండి 85,000 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కేంద్ర రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతనగల డిఫెన్స్ ఎకిజిషన్ కౌన్సిల్ (డిఎసి) ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాముల సేకణకు ఆమోదముద్ర వేసింది. భారత నావికాదళం అవసరాలు తీర్చేందుకు ఈ జలాంతర్గాములను వినియోగిస్తారు. భారతదేశం ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధ విమానాలను సేకరించింది. రష్యా నుండి సుఖోయ్ విమానాలను సేకరించిన 23 ఏళ్ళ తరువాత ఈ రాఫెల్ జెట్ విమానాలను భారత్ దిగుమతి చేసుకుంది. వీటితోపాటు సంబంధిత ఇతర సామాగ్రిని, విడి భాగాలను కూడా దిగుమతి చేసుకుంటారు. వీటిల్లో ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వాలమధ్య జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా డిఎసి ఈ అనుమతి ఇచ్చింది. రెండు ప్రభుత్వాలమధ్య గతంలోనే వీటి సేకరణకు సంబంధించిన బడ్జెట్, కొనుగోలు ధరలపై లావాదేవీలు, ఒప్పందాలు జరిగాయి. మోడీ, మేక్రాన్ ఇద్దరు శుక్రవారం చర్చల అనంతరం ఈ మెగా ప్రాజెక్టు గురించి ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. రెండు దేశాలూ ఇప్పటికే సన్నిహితంగా వ్యూహాత్మక, రక్షణ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. రక్షణ సంబంధమైన సైనిక పరికరాల కొనుగోళ్ళకు సంబంధించి రక్షణశాస్త్రలో ఉన్న అత్యున్నత విభాగం డిఎసి ప్రధాని ఫ్రాన్స్ పర్యటన రోజే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. మోడీ రెండు రోజులు పారిస్‌లో పర్యటిస్తారు.ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రెండు దేశాల అధికారులు, ఇంజనీర్లు ఈ విషయంలో సంభాషణలు జరుపుతూనే ఉన్నారు. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎఎంసిఎ)తో సహా కొత్త తరం ఎయిర్‌క్రాఫ్‌లకు శక్తిని ఇచ్చేందుకు వీటుగా ఫైటర్ జెట్ ఇంజన్లను అభివృద్ధి చేస్తారు.వీటి కొనుగోలు తరువాత వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ నిర్వహించడానికి వీలైన సమగ్ర ఒప్పందాలు కూడా ఈ కాంట్రాక్టులోనే ఉన్నాయి. ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ దస్సౌల్ట్ ఎవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తుంది. సంతకాలుచేసిన తరువాత మూడేళ్ళకు వీటిని మనకు సరఫరా చేస్తారు.అదేవిధంగా ఆ వరుసలోనే మూడు జలాంతర్గాముల సరఫరా కూడా చేస్తారు.ఈ ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఆరు జలాంంతర్గాములను భారత్‌లోనే మెజగాన్ డాక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ సాయంతో ఈ నిర్మాణాలు జరిగాయి. దీనికి అదనంగా మరో మూడు జలాంతర్గాముల సేకరణకు డిఎసి గురువారం అనుమతులు ఇచ్చింది.
కొత్తగా 26రాఫెల్స్
RELATED ARTICLES