మరో 8 మంది మృతి
ఇప్పటి వరకు 645 మంది మృత్యువాత
రాష్ట్రంలో 82,647కు చేరిన కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కొత్తగా 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం సంఖ్య 82,647కు చేరింది. 8 మంది మరణించగా ఇప్పటి వరకు 645 మంది మృత్యువాతపడ్డారు. ఒక రోజులో 1788 మంది మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు 59,374 మంది కోలుకున్నారు. సోమవారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనాతో రాష్ట్రంలో 0.78 శాతం మరణిస్తుండగా జాతీయ స్థాయిలో 2.0 శాతం మంది మృతి చెందుతున్నారు. రాష్ట్రంలో 71.84 శాతం మంది కరోనా నుంచి కోలుకోగా జాతీయ స్థాయిలో 69.33 శాతం మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 శాతం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. గడిచిన 24 గంటల్లో (సోమవారం) 18,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 959 రిపోర్ట్ రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం 6,42875 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. టెలిమెడిసిన్, ఇతర సమస్యలేమైనా ఉంటే 104 నంబర్‌కు, ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన ఫిర్యాదులకు 9154170960 నంబర్‌కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఒక రోజులో గ్రేటర్ హైదరాబాద్‌లో 338, రంగారెడ్డిలో 147, కరీంనగర్‌లో121,మేడ్చల్ మల్కాజిగిరిలో 119, వరంగల్ అర్బన్‌లో 95 కేసులు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ కేసుల జాబితాలో 7 పాజిటివ్ కేసులతో నాగర్‌కర్నూల్ జిల్లా ఒక్కటే ఉన్నది. మిగతా జిల్లాల్లో డబల్, ట్రిబుల్ డిజిట్ సంఖ్యలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మొత్తం 20.396 బెడ్స్ ఉండగా, ఇందులో 2629 మంది కరోనా పేషంట్లు చికిత్స పొందుతుండగా మిగిలిన 17,767 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ లెక్కలు ఇలా ఉన్నాయి:
సోమవారం ఆదిలాబాద్‌లో 14, భద్రాచలం-కొత్తగూడెంలో 60, జిహెచ్‌ఎంసిలో 338, జగిత్యాలలో 59, జనగాంలో71, జయశంకర్ భూపాల్‌పల్లిలో20, జోగులాంబ గద్వాల్‌లో85, కామారెడ్డిలో 71, కరీంనగర్‌లో 121, ఖమ్మంలో 65, కొమురంభీమ్ ఆసిఫాబాద్‌లో 17, మహబూబ్‌నగర్‌లో 58, మహబూబాబాద్‌లో 23, మంచిర్యాలలో 11, మెదక్‌లో 14, మేడ్చల్- మల్కాజిగిరిలో 119, ములుగులో 23, నాగర్‌కర్నూల్‌లో 7, నల్లగొండలో 54, నారాయణపేట్‌లో 13, నిర్మల్‌లో 12, నిజామాబాద్‌లో 42, పెద్దపల్లిలో 66,రాజన్న సిరిసిల్లలో38, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 49, సిద్దిపేటలో 64, సూర్యాపేటలో32, వికారాబాద్‌లో 21,వనపర్తిలో 28,వరంగల్ రూరల్‌లో 35,వరంగల్ అర్బన్‌లో 95,యాదాద్రి-భువనగిరిలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 1896 కేసులు
RELATED ARTICLES