23 మంది జల సమాధి
ముంబయిలో సాధారణ స్థితికి జనజీవనం
ముంబయి: గత ఐదు రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం సంబంధిత ఘటనలకు దాదాపు 35 మ ందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కొ ంకన్ తీరప్రాంతంలో ఉన్న ఓ డ్యామ్ కొట్టుకుపోయింది. ఫలితంగా వరద నీరు డ్యామ్ కింద ఉ న్న గ్రామాలను ముంచెత్తింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను వెలికి తీశామని ఓ పోలీసు అధికారి చెప్పారు. మొత్తం 23 మంది వరకు మృతి చె ంది ఉండవచ్చని ఆయన అన్నారు. రత్నగిరి జిల్లా చిప్లన్ తాలూకాలో ఉన్న తివారీ డ్యామ్ సామ ర్థ్యం 20 లక్షల క్యూబిక్ మీటర్లు. అయితే భారీ వ ర్షాల కారణంగా వరద పోటెత్తడంతో మంగళవా రం అర్ధరాత్రి డ్యామ్ కొట్టుకుపోయిందని జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరద నీరు డ్యామ్ కింద ఉన్న ఏడు గ్రామాలను ముంచెత్తగా 12 ఇ ళ్లు నీటిలో కొట్టుకుపోయాయని రత్నగిరి అదనపు ఎస్‌పి విశాల్ వెల్లడించారు. గత నవంబర్‌లో డ్యా మ్‌కు పగుళ్లు ఏర్పడినట్లు తాము గుర్తిం చి మరమ్మతులు చేయాలని జిల్లా అధికారులను వి జ్ఞప్తి చేశామని అయినా వారు పట్టించుకోలేదని బాధి త బంధువులు ఆరోపించారు. అధికారుల నిర్ల క్ష్యం కారణంగా ఇప్పుడు డామ్ కొట్టుకుపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు, భార్య, ఆరు నెలలు ఉన్న తన బా లుడు కొట్టుకుపోయారని ఓ బాధితుడు తీవ్ర ఆవేదన చెందారు. కాగా, జాతీయ పునరావాస సహా య సిబ్బంది, పోలీసులు, స్థానిక అధికారులు, వాలంటీర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఘ టనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. డ్యామ్ కొట్టుకుపోవడానికి గల కా రణాలపై దర్యాప్తు చేపట్టాలని, బా ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీ సుంటామన్నారు. డ్యామ్‌వద్ద జరుగుతున్న సహాయక చర్యలు, పరిస్థితిపై జిల్లా అధికారులను ఫోన్‌ద్వారా అడిగి తెలుసుకున్నారు.
సాధారణస్థితికి చేరుకుంటున్న ముంబయి
గత ఐదు రోజులుగా భారీ వర్షాలతో విలవిలలాడిన ముంబయి బుధవారం సాధారణస్థితికి చేరుకుంది. పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నా యి. లక్షలాది మంది ప్రయాణికులతో రైళ్ల కిటకిటలాడాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద లు తగ్గుముఖం పట్టాయి. 2005 నుంచి మంగళవారం నగరంలో అత్యధికంగా వర్షం కురిసిన వి షయం తెలిసిందే. వర్షం ధాటికి గోడలు కూలి 30మంది మృతి చెందగా, వర్షం సంబంధిత ఘ టనలకు మరో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే బుధవారం నాటికి పరిస్థతి కాస్త మెరుగుపడింది. జనజీవనం తమ రోజు వారి కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించారు. బుధవారం నుంచి శుక్రవారం మధ్య ముంబయికి తీవ్ర వరద ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రైవైటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది.