ఒక్కరోజే 31 కరోనా కేసులు ఈ మధ్యకాలంలో ఇవే అధికం
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుండి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈమధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా శనివారంనాడు ఏకంగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ 19 కేసుల సం ఖ్య 1163కి పెరిగాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన బులిటెన్‌లో వెల్లడించింది. శనివారం నాడు 24 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 751కి పెరిగింది. తాజాగా మరొక వ్యక్తి మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 30కిచేరింది. ప్రస్తుతం 382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం నమోదైన 31 కేసుల్లో 30 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదైనవే. ఇంకొక కేసు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలించిన వలస కార్మికుడు.
కేసులు పెరిగాయ్!
RELATED ARTICLES