దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త కరోనా కేసుల కంటే కొత్త రికవరీలే అధికం
భారత్‌లో ఒక్కరోజే 94,612 మంది డిశ్చార్జ్
మొత్తం కేసులు 54,00,619
కరోనాతో 86,752 మంది బాధితులు మృత్యువాత
24 గంటల్లో 92,605 మందికి పాజిటివ్
మరో 1,133 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం 90 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. 86 వేలకుపైగా మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కేసల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడం వరుసగా ఇది రెండరోజు. అయితే కొత్త కేసుల కంటే తాజా రికవరీల సంఖ్య అధికంగా ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మొత్తం రికవరీల సంఖ్య సంఖ్య 43 లక్షలు దాటింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. అదే విధంగా 24 గంటల్లో 1,133 మందిని కరోనా బలితీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 86,752 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.61 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. ఒక్కరోజే 94,612 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆదివారం ఉదయం నాటికి 43,03,043 మంది మహమ్మారిని జయించారు. 24 గంటల్లో 94,612 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,605 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రికవరీ రేటు 79.68 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 10,10,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 18.72 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు దాటింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రికవరీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 6,36,61,060 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. శనివారం దేశవ్యాప్తంగా 12,06,806 శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయట పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో20 వేల కొత్త కేసులు, 425 మంది మృతి
మహారాష్ట్రలో 24 గంటల్లో 20,519 మంది మహమ్మారి బారిన పడగా, 425 మంది మత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 32,216కు చేరగా, కేసుల సంఖ్య 11,88,015కు పెరిగింది. తమిళనాడులో 24 గంటల్లో 66 మంది మరణించగా, కొత్తగా 5,569 మందికి వైరస్ సోకింది. మొత్తం మృతుల సంఖ్య 8,751, బాధితుల సంఖ్య 5,36,477కి చేరింది. కర్నాటకలో కొత్తగా 114 మరణాలు సంభవించగా, 8,364 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7,922కు, కేసుల సంఖ్య 5,11,346కు చేరింది. ఢిల్లీలో తాజాగా 4,071 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 38 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,945కు, బాధితుల సంఖ్య 2,42,899కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతులు 5,302కు చేరారు. రాష్ట్రంలో కొత్తగా 8,218 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 6,17.776కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మృతులు 4,953 కాగా, కొత్తగా 84 మంది మరణించారు. 5,729 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 3,48,517 మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం మృతులు 4,298 కాగా, తాజాగా 56 మంది చనిపోగా, మొత్తం 2,21,960 మందికి వైరస్ సోకింది. గుజరాత్‌లో మొత్తం మృతులు 3,302 కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,21,768 కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 1,432 మందికి వైరస్ సోకింది. పంజాబ్‌లో మృతుల సంఖ్య 2,754 నమోదు కాగా, ఒక్క రోజులో 49 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 1,943గా ఉండగా, మొత్తం 1,03,065 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,322 నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 1,13,124కి చేరింది.
కొత్తగా 2137 కేసులు నమోదు
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కోలుకున్న 2192 మంది బాధితులు
ప్రజాపక్షం/హైదరాబాద్
కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 2137 కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. కరోనాతో 8 మంది మరణించగా మొత్తం 1033 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 2192 మంది కోలుకున్నారు. ఈ మేరకు శనివారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో 53,811 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 1185 రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,88,220 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 1,71,306 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 1,39,700 మంది కోలుకున్నారు. 1033 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం 30,573 యాక్టివ్ కేసులు నమోదవ్వగా ప్రస్తుతం గృహ, ఇతర సంస్థలలో 24,019 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.60 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 1.60 శాతం ఉన్నది. అలాగే రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 81.54 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 79.65 శాతంగా నమోదైంది.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ లెక్కలు ఇలా ఉన్నాయి:
శనివారం నాడు ఆదిలాబాద్‌లో 20,భద్రాద్రి-కొత్తగూడెంలో51, జిహెచ్‌ఎంసిలో 322, జగిత్యాలలో 42, జనగామలో 34,జయశంకర్ భూపాల్‌పల్లిలో21, జోగులాంబ గద్వాల్‌లో27,కామారెడ్డిలో60, కరీంనగర్‌లో132,
ఖమ్మంలో 90, కొమురంబీమ్ ఆసిఫాబాద్‌లో16, మహబూబ్‌నగర్‌లో 28,మహబూబాబాద్‌లో 72,మంచిర్యాలలో 38,మెదక్‌లో28, మేడ్చల్-మల్కాజిగిరిలో 146,ములుగులో15,నాగర్‌కర్నూల్‌లో37,నల్లగొండలో 124,నారాయణపేట్‌లో9, నిర్మల్‌లో 24, నిజామాబాద్‌లో72, పెద్దపల్లిలో48,రాజన్న సిరిసిల్లాలో57,రంగారెడ్డిలో 182,సంగారెడ్డిలో65, సిద్దిపేటలో 109, సూర్యాపేటలో61, వికారాబాద్‌లో 29,వనపర్తిలో 29,వరంగల్ రూరల్‌లో24,వరంగల్ అర్బన్‌లో 90,యాదాద్రి-భువనగిరిలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.