న్యూఢిల్లీ: ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారి సహా తాజాగా నలుగురికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో భారత్‌లో కరోనా కేసులు 43కు పెరిగాయి. ఈ విషయాన్ని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం చెప్పారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, జమ్ములో ఒక్కో కేసు తాజాగా నమోదయినట్లు కూడా ఆ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్‌లోని ముషిరాబాద్‌కు చెందిన రోగి ఆదివారం చనిపోయాడు. అయితే అతడికి పరీక్షలో కొవిడ్ నెగటివ్ అని తేలినట్లు కూడా అధికారులు చెప్పారు. జమ్ముకు చెందిన వ్యక్తి ఇటీవల ఇరాన్ పర్యటించి వచ్చాడు. అతడిది జమ్ములో తొలి వైరస్ కేసు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రోగి ఆగ్రా నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కాంటాక్ట్‌లోకి రావడంతో అతడికి కూడా వైరస్ పాజిటివ్ అని తేలిందని అధికారులు వివరించారు. ఢిల్లీ రోగికి మాత్రం ఎక్కడికి పర్యటించిన చరిత్ర లేదు. కానీ అతడికి ఢిల్లీ నగరంలోనే ఆ వ్యాధి సోకిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అయితే దీనికి ముందు ఆ రోగి ఇటలీకి పర్యటించాడని కూడా కొందరు అధికారులు పేర్కొన్నారు. నిరోధించే మార్గదర్శకాలను మేము అన్ని రాష్ట్రాలకు పంపాము. కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు లాబొరేటరీలు, సిబ్బందిని పెంచుకోవాలని, అలాగే ఎర్లీ ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనావైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని కూడా ఆయన తెలిపారు. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 8,255 విమానాల ద్వారా వచ్చిన 8,74,708 మందిని స్క్రీనింగ్ చేశారు. వారిలో 1,921 మంది ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. వీరిలో 177 మందిని హాస్పిటల్‌లో చేర్పించినట్లు, 33,599 మందిని అబ్జర్వులో పెట్టినట్లు, 21,867 మందికి అబ్జర్వేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు.
కొవిడ్ సంబంధించిన 3,003 శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో 43 పాజిటివ్ అని తేలగా, 2,694 నెగటివ్ అని తేలాయి. ఇప్పటి వరకు 90కి పైగా దేశాలలో 1,10,041 కరోనావైరస్ కేసులున్నట్లు, 3,825 మంది చనిపోయినట్లు అంచనా. మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కొచ్చికి చేరగా, థర్మల్ స్క్రీనింగ్‌లో అతడికి వ్యాధిలక్షణాలు కనిపించేసరికి వారిని వెంటనే కలంస్సెరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చిన్నారికి పరీక్షలో పాజిటివ్ అని తేలింది.
కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనావైరస్!
RELATED ARTICLES