తిరువనంతపురం: భారత్‌లో కరోనావైరస్ సోకినవారి సంఖ్య ఆదివారం 39కి చేరింది. ఇటలీ నుంచి వచ్చిన దంపతులు, వారి కుమారుడు విమానాశ్రయంలో స్క్రీనింగ్‌నింగ్‌ని తప్పించుకున్నారు. ఆ తర్వాత కేరళలో వారి ఇద్దరి బంధువులను పరీక్షించగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ప్రయాణ చరిత్రను, వ్యాధి లక్షణాలను దాపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రాసిక్యూట్ చేస్తామని రాష్ట్ర అధికారులు హెచ్చరించారు. కొత్త కేసులు వెలుగుచూడ్డంతో హై అలర్ట్ పెట్టామని కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ తెలిపారు. కేరళలో పక్షం క్రితమే ఉహాన్ నుంచి తిరిగొచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థులను కోలుకున్నాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనావైరస్ ఉన్న ఆ దంపతులు ఫిబ్రవరి 29న ప్రయాణించిన వెనీస్ ఖతార్ ఎయిర్‌లైన్స్ క్యూఆర్ 126 విమానం, అలాగే దోహ నుంచి కొచ్చికి ప్రయాణించి మార్చి 1న ఉదయం 8.20కి చేరకున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం క్యూఆర్ 514 విమానంలో …వారితో ప్రయాణించిన ప్రయాణికు లు ఆరోగ్య అధికారుల టచ్‌లో ఉండాల్సిందిగా కూడా శైలజ చెప్పారు. కాగా ఖతార్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంలో భారత ఆరోగ్య అధికారులతో సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ట్రావెల్ హిస్టరీ, వ్యాధి లక్షణాలను తెలుపడంలో విఫలమవ్వడాన్ని నేరంగా పరిగణిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘ఇది అక్రమం, శిక్షార్హం’ అని కేరళ పోలీసులు వేరేగా చెప్పారు. ‘వారి మీద ప్రాసిక్యూషన్ సహా కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వ వివిధ సంస్థల ఆదేశాలను ఈ విషయంలో పాటించాల్సిందే’ అని కూడా పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. కేరళలో సోమవారం మహిళల అతిపెద్ద మతపరమైన వేడుక ఒకటి జరగనుంది. దానిని ‘అట్టుకల్ పొంగల’ అంటారు. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. విదేశాల నుంచి వచ్చినవారు, వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారు తమ హోటళ్లలోనే వివరాలు ఇచ్చేయాలని తాజాగా కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదలచేసింది.ఇటలీ నుం చి వచ్చిన దంపతులు తమ 50వ దశకంలో ఉన్నారని, వారి కుమారుడు 24ఏళ్ల వయస్సు వాడని, వారు ఇటలీ నుంచి భారత్‌కు ఫిబ్రవరి 29న వచ్చారని, విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయించుకోకుండా ఎగవేశారని, వారి ఇద్దరు బంధువులు కూడా వైరస్‌కు గురయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ వివరించారు. వారంతా పథ్నంథిట్ట జిల్లాలోని రన్నికి చెందిన వారని కూడా చెప్పారు.
కేరళలో మరో ఐదుగురికి కరోనా!
RELATED ARTICLES