కేరళ వ్యాప్తంగా వామపక్ష సంఘటన నిరసన ప్రదర్శనలు
పథకం ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం
కోచి: అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో పథకం ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులపై బిజెపి చేస్తు న్న ఆరోపణలను ఖండిస్తూ, శనివారంనాడు కేరళ రాష్ట్రవ్యాప్తంగా అధికార వామపక్ష సంఘటన (ఎల్‌డిఎఫ్) నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు.కేంద్ర ప్రభుత్వ అధీనంలోగల కస్ట మ్స్ కార్యాలయాల వరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ప్రదర్శనలు జరిపారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వానగల ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. కోచి, తిరువనంతపురం, కోజికోడ్ సహా అనేక ముఖ్యప్రాంతాల్లో కస్టమ్స్ కార్యాలయాల వరకు వామపక్ష సంఘటన కార్యకర్తలు వేలాదిమంది నిరసన ప్రదర్శనలు చేశారు. అత్యున్నతమైనంద్ర ప్రభుత్వ సంస్థలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సిపిఎం నాయకులు విమర్శించారు. కస్టమ్స్ అధికారులు రాష్ట్రంలో బిజెపి-,కాంగ్రెస్‌లకు అనుకూలంగా, ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచార యంత్రాంగంగా మారారని విమర్శించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మరో ముగ్గురు మంత్రులను బంగారం స్మగ్లింగ్ కేసులో ఇరికించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, అధికార వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, భయపెట్టి, ఎన్నికల్లో వారి విజయావకాశాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని వామపక్ష సంఘట న కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమకు గిట్టనివారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ఆయుధంలా ఉపయోగించుకునే కుట్రలను ఉధృతంగా బిజెపి అమలు చేస్తోందని నాయకులు విమర్శించారు. బిజెపి ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శిస్తూ, ఫేస్‌బుక్‌లో, టిట్టర్‌లో ధర్మాగ్రహం, న్యాయబద్ధమైన విమర్శలు చేసిన బాలీవుడ్ నటి తాప్సీపన్ను, దర్శక నిర్మాత అనురాగ్ కాశ్యప్‌లపై ఆదాయపన్నుశాఖ దాడులు చేసింది. తాజాగా ముఫ్తీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపిపై కూడా ఇదేవిధమైన ఆరోపణలు, వేధింపులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్, మరికొందరు మంత్రులపైన కస్టమ్స్‌శాఖ ఆరోపణలు చేస్తుండగా, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహాబూబా ముఫ్తి మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ హవాలా కేసు బనాయించి తమ ఎదుట హాజరుకావాలని బెదిరింపులు చేస్తోంది. కేరళ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం, కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేయడంతో రాష్ట్రంలో తాజాగా రాజకీయ యుద్ధానికి తెరలేచింది. 2020 జూలై 5వ తేదీన కస్టమ్స్ అధికారులు తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి ఓ దౌత్యవేత్త బ్యాగేజీ ద్వారా ఇది కేరళకు చేరింది. ఈ బ్యాగేజీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి చేరాల్సి ఉంది. అయితే ఈ అక్రమ రవాణా కేసులో ఐటీశాఖ అధికారిణి స్వప్న సురేశ్ కీలకపాత్రధారిగా మారారు. ఆమె పినరయి విజయన్‌పైన, స్పీకర్ శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులపైన ఈ కేసుతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు చేయడంతో బిజెపి నిర్వాకం చూసి దేశం విస్తుపోయింది. వారిని మార్చి 12న విచారణకు హాజరు కావాలంటూ కస్టమ్స్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో కేరళవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.
కేంద్ర సర్కార్ తీరుపై భగ్గుమన్న ఎల్‌డిఎఫ్
RELATED ARTICLES