HomeNewsBreaking Newsకేంద్ర ఉద్యోగులు, పింఛన్‌దారులకు 4 డిఎ పంపు?

కేంద్ర ఉద్యోగులు, పింఛన్‌దారులకు 4 డిఎ పంపు?

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పబోతోంది. ప్రస్తుతం అంగీకరించిన ఫార్ము లా ప్రకారం కరువు భత్యం (డిఎ)ను నాలుగు శాతం పెంచబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 38 శాతంగా ఉన్న డిఎను 42 శాతానికి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్‌ బ్యూరో ప్రతి నెలా పారిశ్రామిక రంగ కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ (సిపిఐఐడబ్ల్యు)ని రూపొందిస్తుంది. దీని ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారులకు
డిఎను నిర్ణయిస్తారు. ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, 2022 డిసెంబరు సిపిఐఐడబ్ల్యు 2023 జనవరి 31న విడుదలైందని చెప్పారు. డిఎ పెంపు 4.23గా ఉండాలని లెక్కలు చెప్తున్నాయన్నారు. అయితే దశాంశ స్థానాల్లో ఉన్నదానిని పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. అందువల్ల డిఎ 4 శాతం పెరగవచ్చునని తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల శాఖ డిఎ పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి, ఆ పెంపు వల్ల భరించవలసిన పర్యవసానాలను వివరిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం పంపిస్తారన్నారు. డిఎను పెంచుతూ నిర్ణయం తీసుకుంటే, పెంచిన డిఎ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. 2022 సెప్టెంబరు 28న డిఎ రివిజన్‌ జరిగింది. అది 2022 జూలై 1 నుంచి అమలవుతోంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ మదింపు చేశారు. 2022 జూన్‌తో ముగిసిన 12 నెలల నెలవారీ ధరల సగటు ఆధారంగా ఈ డిఎను నిర్ణయించారు. అప్పుడు కూడా నాలుగు శాతమే పెంచారు. పెరిగే ధరల భారానికి పరిహారంగా డిఎను ప్రభుత్వం చెల్లిస్తుంది. కొంత కాలంలో జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. ఇది సిపిఐఐడబ్ల్యులో వెల్లడవుతుంది. డిఎను సంవత్సరంలో రెండుసార్లు పీరియాడికల్‌గా సవరిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments