హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టిఆర్ ఎస్ ఓడిపోవాలని, ప్రజాకూటమి గెల వాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని చెప్పారు. తెలుగువారందరూ కలిసుందామని తాను అంటుంటే, మీరెవరు చెప్పడానికి అని కెసిఆర్ తనను ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉన్న కెసిఆర్.. ఇప్పుడు తననే విమర్శిస్తున్నారని, ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన టిడిపి గురించే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి శంకుస్థాపన సందర్భంగా సోమవారం చంద్రబాబు ఈ అంశాలపై మాట్లాడారు. కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసని, తన అనుచరుడిగా ఉన్న వ్యక్తి తనను తిడితే బాధ అనిపించదా?, దీన్ని కెసిఆర్ విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టులతో పాటు పలు సంస్థలు ఏర్పాటు కావడానికి తానే కారణమని పేర్కొన్నారు. వైసిపి, జనసేనల వైఖరిపై చంద్రబాబు విమర్శలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి వైసిపి మద్దతు పలికిందని, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే తమ మద్దతు అని మీటింగుల్లో వైసిపి నేతలు చెబుతు న్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బిజెపికి అండగా ఉన్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో హైదరాబాదును అభివృద్ధి చేసినప్పుడు అమరావతిని ఎందుకు చేయలేదని కెసిఆర్ ప్రశ్నిస్తున్నారని, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు.
కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు
RELATED ARTICLES