HomeNewsBreaking Newsకెసిఆర్‌పై పోటీ చేస్తా

కెసిఆర్‌పై పోటీ చేస్తా

ఈటల సంచలన ప్రకటన
ప్రజాపక్షం/హైదరాబాద్‌
వచ్చే శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకర్గం నుండి పోటీ చేయనున్నట్టు బిజెపి ఎం ఎల్‌ఎ ఈటల రాజేందర్‌ ప్రకటించారు. బెం గాల్‌లో అక్కడి సిఎం మమతా బెనర్జీని సువేందో అధికారి ఓడించినట్టుగానే తాను కెసిఆర్‌ను ఓడిస్తానని, ఆ దిశగా తాను సీరియస్‌గానే పని చేస్తున్నానని తెలిపారు. బిజెపికి చెందిన నలుగురు కార్పొరేటర్లను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటా మా?, టిఆర్‌ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని, బిజెపిలో కూడా భారీ చేరికలు ఉంటాయని, టిఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయమని హెచ్చరించారు. హైదరాబా ద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఈటల రాజేందర్‌ జర్నలిస్టులతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. అంతకుముందు మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ను కొట్టాలంటే ఈగోలు పక్కన పెట్టి, ఒకే లక్ష్యంగా పని చేయాలని, పార్టీ నేతలకు కేవలం ఒక కెసిఆర్‌ మాత్రమే కనిపించాలన్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. టిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ జారుడుబండ మాదిరిగా పడిపోతుందని, రాష్ట్రంలో ఏకంగా ముఖ్యమంత్రి గ్రాఫ్‌ పడిపోయిందన్నారు. సిఎం కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో తన సొంత చట్టాన్ని అమలు చేస్తూ, గిరిజనులను రాసి రంపాన పెడుతున్నారని విమర్శించారు. పేదలకు చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు కెసిఆర్‌ బ్రోకర్‌గా మారారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ చుట్టు ఉన్న భూములపై కెసిఆర్‌ కన్నెశారని, వాటిని విక్రయించాలని టార్గెట్‌ విధించారన్నారు. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సిఎం మాటలకు, చేష్టలకు తేడా ఉందని, అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా హక్కు కల్పించలేదని ఆరోపించారు. దళితుల కోసమే పుట్టానని చెప్పుకుంటున్న సిఎం కెసిఆర్‌, దళితులను, పేదల భూములపైనే కన్నేశారన్నారు. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే స్వాధీనం చేసుకుంటుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సిఎం ప్రైవేటు వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్‌ వ్యాపారం చేస్తోందని, కెసిఆర్‌ ఇంతకు రియల్‌ వ్యాపారా? లేదా బ్రోకరా అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ సదస్సుల పేరుతో మరోసారి ప్రజల నోళ్లలో మట్టికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నార

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments