సిఎం కుమ్మక్కు : రేవంత్‌రెడ్డి వెల్లడి
హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ముడి సరుకు తయారీలో చీకటి కోణం
ప్రజాపక్షం/ హైదరాబాద్: కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ మందు తయారీకి అవసరమైన ముడిసరుకు తయారీకి ఒక అనామక కంపెనీతో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) ఒప్పందం వెనక చీకటి కోణం ఉన్నదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపి ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్సెస్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థ తో ఈ ఒప్పందం జరిగిందని, ఇందులో మంత్రి కెటిఆర్ బంధువు పాకాల రాజేందర్ డైరెక్టర్ అని అన్నారు. హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం 10 వేల కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందం కోసం సిఎం కెసిఆర్, కెటిఆర్‌లు మధ్యవర్తిత్వం వహించారన్నారు. రాజేందర్ డైరెక్టర్‌గా రాగా నే రూ. 140 కోట్ల పెట్టుబడులు ఈ సంస్థకు వచ్చాయని, ఆయన సైం టిస్ట్ కాదని, ఎలాంటి ఫార్మా అనుభవం లేదని, ఆయన సంస్థ గతంలో ఎలాంటి మందును కనుగొనలేదని చెప్పారు. వేల కోట్ల ఎగుమతులు- లక్షల రూపాయలు టాక్స్ కట్టే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు కాకుండా అడ్రస్ లేని సంస్థకు ఒప్పందం ఎలా కుదరిందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించా రు. తమ బంధువు కోసం కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని పణంగా పెట్టి ఒప్పం దం చేయించారని అరోపించారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం చే యడంపై బిజెపి సమాధానం చెప్పాలని, అనుభవం లేని సంస్థతో ఒప్పం దం చేసుకుంటే బిజెపి, టిఆర్‌ఎస్ అంతర్గత కుమ్మక్కు అయినట్లు అర్థం అవుతుందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు వ్యాపా రం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు? బంధుత్వం పేరుతో కెసిఆర్, కెటిఆర్‌లు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి సాయం కోరారా? కావాల్సిన సహాయం పై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా లేఖలు రాసిందా? రాస్తే బయటపెట్టాలి? బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన సహకారం ఏమిటో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లాక్సెస్ లైఫ్ సైన్సెన్‌కు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏమి అర్హత చూసి ఇచ్చిందో చెప్పాలన్నారు. టిఆర్‌ఎస్, -బిజెపి వేర్వేరు కాదని, రెండూ ఒక్కటేనని , బయట మాత్రం విమర్శలు చేసుకుంటారన్నారు. ఒప్పందం విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాస్తానని,పార్లమెంట్‌లో ప్రశ్నిస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు కేంద్రాన్ని కోరిన రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్లను ప్రజలకు తెలియ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే తాము ప్రభుత్వానికి అండగా ఉంటూ పార్లమెంట్ లో పోరాటం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
కెటిఆర్ బామ్మర్దిపై కనకవర్షం
RELATED ARTICLES