పెర్త్: ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి రాహుల్ కేవలం 48 పరుగులే చేశాడు. తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. వరుసగా విఫలమవుతున్న ఇతనిని భారత జట్టులో ఎందుకు అవకాశం ఇస్తున్నారని అభిమానులు బిసిసిఐ, విరాట్ కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో తప్ప మిగతా మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా విఫలమైన రాహుల్‌ను సెలెక్టర్లు పదేపదే అవకాశం ఇవ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు.
కెఎల్ రాహుల్‌పై విమర్శలు…
RELATED ARTICLES