ప్రో కబడ్డీ లీగ్ ఈ సారి దుమ్ము రేపనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించి సొంతం చేసుకున్నారు. కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రీటెయిన్ చేసుకోగా మరికొంత మంది ఆటగాళ్లు కొత్తగా జట్లులో వచ్చి చేరారు. మొత్తంగా 12 జట్లు ప్రోకబడ్డి లీగ్ టైటిల్ కోసం బరిలో నిలవనున్నాయి.అయితే ఈ సారి వే లంపాటలో రాజస్థాన్‌కు చెం దిన రైడర్ సచిన్ తన్వార్ పం ట పండింది. రాజస్థాన్ జట్టు తన్వార్‌ను రిలీజ్ చేయడంతో ఆ ఆటగాడిని తమిళ్ తలైవాస్ జట్టు రూ.2.15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావ్ తెలుగు టైటాన్స్ జట్టు యాజమాన్యంఫైనల్ బి్డ మ్యాచ్ కార్డు వినియోగించి రూ..1.725 కోట్లకు కొనుగోలు చేసింది. ముందుగా యుముంబా మరియు బెంగళూరు బుల్స్ పవన్ కోసం పోటీ పడ్డాయి. ఒకానొక సమయంలో బెంగళూరు బుల్స్ పవన్ కోసం రూ.కోటి వెచ్చించేందుకు తయారైంది.ఇక ఒకానొక సమయంలో రూ.1.45 కోట్లకు బిడ్డింగ్ చేరుకోగానే ఇక ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. దీంతో తెలుగు టైటాన్స్ జట్టు తిరిగి పవన్ సెహ్రావత్‌ను దక్కించుకుంది. గత సీజన్లో పవన్ సెహ్రావత్ రికార్డు ధరకు అంటే రూ.2.605 కోట్లకు తెలుగు టైటాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ చేరడంలో విఫలమైంది. ప్రోకబడ్డీ లీగ్ 2024 సీజన్ ఈ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. కూత కూసి వేటు వేసేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆటగాళ్ల కొనుగోలు పూర్తి కావడంతో ఇక బరిలో దిగి కూత పెట్టేందుకు రెడీ అయ్యారు.