ప్రజాపక్షం / హైదరాబాద్ ; రాజకీయ లక్షం కంటే గ్రూపులను సంతృప్తి పరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది. రాష్ట్రంలో నియంతృత్వ టిఆర్ వారితో లాలూ చీ దోస్తీలో ఉన్న బిజెపిని ఓడించే లక్షం నెరవేరాలంటే భాగస్వామ్య పక్షాల మధ్య సహృద్భావంతో కూడిన విశ్వాసం ఉండాలని అభిప్రాయపడింది. దీనికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలకు పెద్ద పార్టీయైన కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత వహించాలని హెచ్చరించింది. కొత్తగూడెం, వైరా, హుస్నాబా ద్, మునుగోడు, బెల్లంపల్లిలో పోటీ చేయాలని తీర్మానించింది. తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం మఖ్దూంభవన్ జరిగింది. సిపిఐ కార్యవర్గ సభ్యులు గోదా శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ హాజరయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ సీట్ల సర్దుబాటుపై సమావేశం లో వివరించారు. సిపిఐకి మూడు స్థానాలను కేటాయించినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ప్రకటించడంపై రాష్ట్ర కార్యవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా సీట్లను ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిఆర్ ఓడించే ప్రధాన లక్షంతోనే సిపిఐ పోరాడుతుందని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు కార్యవర్గ వివరాలను వెల్లడిస్తూ చాడ వెంకట్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశా రు. ఇదిలా ఉండగా తమ అసంతృప్తిని భాగస్వామ్య పక్షాలకు తెలియజేయాలని సిపిఐ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో సమావేశాన్ని మధ్యలో వాయిదా వేసుకొని సిపిఐ ప్రతినిధి బృందం కాం గ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, టిజెఎస్ అధ్యక్షులు ఎం. కోదండరామ్ కలిసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ నేతృత్వంలోని బృందంలో సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు టి.శ్రీనివాసరావు, ఈర్ల నర్సింహా, పశ్యపద్మ , కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ పల్లా నర్సింహారెడ్డిలు ఉన్నారు.