టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ ఒకడు. అయితే, తాజాగా రిటైర్ట్ సుమో ప్రొపెషనల్స్‌తో పోటీ పడిన సమయంలో తాను సరైన ఆకృతిలో లేనని వెల్లడించడం విశేషం. జపాన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 32 ఏళ్ల జోకోవిచ్ ప్రస్తుతం రాజధాని టోక్యోలో పర్యటిస్తున్నాడు. మార్నింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా సుమో ప్రొఫెషనల్స్ సాధన చేసే సంప్రదాయ దోహ్యో కేంద్రం లేదా సుమో రింగ్‌కు వెళ్లాడు. తొలుత వారు ప్రాక్టీస్ చేస్తుంటే వీక్షించిన జొకోవిచ్ ఆ తర్వాత వారితో కలిసి కుస్తీ పోటీల్లో తలపడ్డాడు. ఈ పోటీల్లో భాగంగా వారితో పోటీ పడేందుకు తాను సరైన ఆకృతిలో లేనని తెలుసుకున్నాడు. ఈ మేరకు ఏటీపీ వెబ్‌సైట్‌కి ఇచ్చిన రాసిన కాలమ్‌లో జోకోవిచ్ ‘నేను సరైన ఆకృతిలో లేనని అనిపించింది(సుమో). ఇంకొన్ని కిలోలు పెరిగితే వారితో పోటీకి నేను సిద్ధంగా ఉంటా. దాదాపు మూడు రెట్లు బరువు పెరిగితే వారితో పోటీపడగలను‘ అని తెలిపాడు. ‘వారు అంత బరువున్నా ఫ్లెక్సిబుల్‌గా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. హెవీవెయిట్ క్రీడగా గుర్తింపు పొందిన ఈ ఆటలో వీరు ఇంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటారని అనుకోలేదు. ఈ క్రీడలో వారు అటు ఇటు కదిలేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. అందుకే వారు సులభంగా కదులుతున్నారు‘ అని జొకోవిచ్ తెలిపాడు. ‘జపాన్‌లో పాపులర్ క్రీడ అయిన సుమోను వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్ననే సుమో రెజ్లర్లను కలిసే అవకాశం నాకు దొరికిందని మా నాన్నకు ఫోన్‌లో చెప్పా. కొన్ని సంవత్సరాల క్రితం నేను మా నాన్న కలిసి అకిబోనో ఆడేటప్పుడు అతడికి మద్దతిచ్చిన పాత రోజులని గుర్తు చేసుకున్నాం‘ అని జొకోవిచ్ అన్నాడు. -ప్రజాపక్షం/క్రీడా విభాగం
కుస్తీ వీరుడిగా మారిన టెన్నిస్ దిగ్గజం
RELATED ARTICLES