సిడ్నీ: భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ తన తొలి టెస్టులోనే అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫ్లాట్ పిచ్‌పై కూడా చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టాడు. బౌలర్లకు ఎలాంటి సహకారం లభించని పిచ్ నుంచి కూడా మంచి ఫలితాల్ని రాబట్టి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడని అరుణ్ అన్నారు. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులో లభించిన అవకాశాన్ని సద్వినియోగించుకున్నాడని అరుణ్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో 31.5 ఓవర్లు వేసిన కుల్దీప్ 99 పరుగులు ఇచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు. ఇతని ధాటికి కంగారూ జట్టు మొదటి ఇనింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ బారినపడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గొప్ప స్పిన్నర్‌గాపేరుతెచ్చుకున్న కుల్దీప్ టెస్టుల్లో కూడా రానురాను ప్రధాన బౌలర్‌గా అవతారం ఎత్తుతాడని బౌలింగ్ కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టుల్లో పెద్దగా ఆడిన అనుభవం అతనికి లేదు కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతను కూడా టెస్టుల్లో కూడా మరిన్ని ప్రదర్శనలు చేస్తాడని ఆయన అన్నారు. తొలి టెస్టు కావడంతో ఈ మ్యాచ్‌లో కుల్దీప్ కొద్దిగా ఒత్తిడికి లోనయ్యాడు. ఈ చైనామన్ బౌలర్ కుల్దీప్ అద్భుతమైన గూగ్లీలు విసురుతాడని, ఇతని బౌలింగ్‌ను అంచనా వేయడం బ్యాట్స్‌మెన్స్‌కు కష్టంగా ఉంటుందని భరత్ అరుణ్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన కుల్దీప్ సిడ్నీ మ్యాచ్‌లో తన సత్తా చాటుకున్నాడని ఆయన పేర్కొన్నారు. బ్యాటింగ్ పిచ్‌పై కూడా ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశాడని కుల్దీప్‌ను టీమిండియా కోచ్ ప్రశంసించారు.
కుల్దీప్‌పై భారత బౌలింగ్ కోచ్ ప్రశంసలు..
RELATED ARTICLES