HomeEntertainmentCinemaకుబేర నుంచి కింగ్‌ నాగ్‌ మరో పోస్టర్‌.!

కుబేర నుంచి కింగ్‌ నాగ్‌ మరో పోస్టర్‌.!

మన టాలీవుడ్‌ ఆల్‌ టైం మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం నా సామిరంగ తో మంచి హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత నాగ్‌ నుంచి మరిన్ని సినిమాలు రాబోతుండగా తాను కీలక పాత్ర చేస్తున్న కుబేర కూడా ఒకటి. టాలెంటెడ్‌ యంగ్‌ హీరో ధనుష్‌ హీరోగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్‌ సినిమానే ఈ కుబేర. మరి ఇందులో నాగార్జున చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా ఇది వరకే తన ఫస్ట్‌ లుక్‌ ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మరి అప్పుడు సీరియస్‌ లుక్‌ లో దర్శనం ఇచ్చిన నాగ్‌ పై ఇప్పుడు బర్త్‌ డే కానుకగా ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌ ని రిలీజ్‌ చేశారు. మరి ఇందులో నాగ్‌ మంచి రిఫ్రెషింగ్‌ గా కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఎవరినో పలకరిస్తున్నట్టుగా నాగ్‌ ఇందులో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్‌ లో ఈ పోస్టర్‌ ఇపుడు వైరల్‌ గా మారింది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్‌ సినిమాస్‌ వారు నిర్మాణం వహిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments