HomeNewsBreaking Newsకుదిరితే పొత్తులు..లేదంటే ఒంటరిగానే పోటీ

కుదిరితే పొత్తులు..లేదంటే ఒంటరిగానే పోటీ

బిఆర్‌ఎస్‌తో సిపిఐకి సంబంధాలు తెగలేదు
రాష్ట్రంలో బిజెపిని నిలువరించేది సిపిఐ మాత్రమే
‘బండి’ని ఎందుకు తొలగించారో బిజెపి సమాధానం చెప్పాలి
సిసిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/కరీంనగర్‌ ప్రతినిధి
రానున్న ఎన్నికల్లో కుదిరితేనే పొత్తులు ఉంటాయని, లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బిఆర్‌ఎస్‌తో సిపిఐ కి బ్రేకప్‌ కాలేదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరుగుతున్న కరీంనగర్‌, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల సిపిఐ రాజకీయ శిక్షణ శిబిరాల ముగింపుకు ముఖ్య అతిధిగా సాంబశివరావు హాజరై దిశానిర్దేశం చేశారు. అంతకుముందు విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో సిపిఐ బిఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేయకపోతే బిజెపి గెలిచేదన్నారు. చాలా మంది ఎంఎల్‌ఎలు బిజెపిలోకి వెళ్లే వారని చెప్పారు. దేశంలో రెండే కూటములని, మూడో దానికి అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో బిజెపిని నిలువరించేది సిపిఐ మాత్రమే అన్నారు. రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, డబ్బులు ఏరులై పారిన అంశాలను ప్రస్తావిస్తూ నేడు మహాత్మా గాంధీ, జయప్రకాశ్‌ నారాయణలు పోటీ చేసినా గెలవరన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పదవీ బాధ్యతలు అప్పగించడంపై బిజెపి అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ మొఖంలో గెలుపు ధీమా
కనిపించలేదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఆశలు వదిలేసుకుందన్నారు. మోడీ విభజన చట్టంలోని అంశాలను విస్మరించారని, కాజిపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ అని 520 కోట్లతో వ్యాగెన్‌ మరమ్మతుల ఫ్యాక్టరీ ఇచ్చారని, దీని వల్ల తెలంగాణపై వివక్షత స్పష్టంగా కనిపించిందన్నారు. కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారంను మరిచిందని, త్రిపుల్‌ ఐటి జాడ లేదని ద్వజమెత్తారు. సిపిఐ కేంద్రంపై రాష్ట్రంపై ప్రజా పోరాటాలు ఆపదని స్పష్టం చేశారు. సిపిఐ ఎవరికీ తలవంచేది లేదని, లొంగమని, గౌరవానికి భంగం కలిగితే ఊరుకోమని వాఖ్యానించారు.
సుశిక్షుతులైన కమ్యూనిస్టు యోధులుగా తయారవ్వండి
సైద్దాంతిక పునాదులపై నిర్మించి ఏర్పడ్డ సిపిఐ సిద్దాంతాన్ని, మారుతున్న రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని సుశిక్షుతులైన కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా తయారవ్వాలని కూనంనేని సాంబశివరావు సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం 1925లో డిసెంబర్‌ 26న దోపిడీ లేని, అంతరాలు లేని, సమసమాజ స్థాపనే లక్ష్యంగా , ఆచరణాత్మక, ఆలోచనా విధానాలతో సైధ్దాంతిక పునాదులపై ఆవర్బివించిన పార్టీ సిపిఐ అని తెలిపారు. అలాంటి పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు అన్ని రంగాల్లో, విషయాల్లో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని, అందుకు సిపిఐ నిర్వహించే రాజకీయ, సైద్దాంతిక శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. వీటిని పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు ఏవైనా ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే కమ్యూనిస్టు పార్టీ శ్రేణులుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సిందేనని, నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి గ్రామాల్లో, వాడల్లో సమస్యలు అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహించేందుకు ప్రజలను చైతన్య వంతులను చేయాలని పోరాటాలు నిర్వహించడంలో సిపిఐ శ్రేణులు ముందుండాలని కూనంనేని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ శిబిరాల్లో సిపిఐ కరీంనగర్‌, సిద్దిపేట, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్‌, గుంటి వేణు, తాండ్ర సదానందం, వెన్న సురేష్‌ పాల్గొన్నారు. శిక్షణ శిబిరానికి నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments