యువ క్రికెటర్లపైనే పెట్టుబడి
నీనియర్లకు మెండిచెయ్యే.. ఐపిఎల్ వేలంపాటు
జైపూర్: ఐపిఎల్ అంటేనే డబ్బులు.. డబ్బుల క్రీడ అంటే అందరికీ ముందు గుర్తుకొచ్చేది ఐపిఎలే. ప్రతి సంవత్సరం భారత్‌లో కన్నులపండగగా జరిగే ఈ ధనాధన్ క్రీడ భారతీయ, విదేశీ ఆటగాళ్లతో దాదాపు రెండు నెలలపాటు ఇక్కడ సందడిగా ఉంటుంది. గత కొంత కాలంగా ఈ ధనాధన్ ఆటకు అసాధారణమైన ఆధరణ లభించింది. ఈ క్రీడలో పెద్దగా అనుభవం లేకున్నా, జాతీయ స్థాయిలో ఆడినా, ఆడకపోయినా పర్వాలేదు అదృష్టం ఉంటే చాలు ఒక్క రోజులోనే కోటీశ్వరులుగా మారవచ్చు. అందుకే ఐపిఎల్‌కు డబ్బుల పండగగా పేరువచ్చింది. ఈ డబ్బుల క్రీడలో కొందరికి అదృష్టం వరించి ఒకేఒక్కరోజులోనే సాధారణ వ్యక్తుల నుంచి కోటీశ్వరులుగా మారుతారు. మరికొందరూ ఈ క్రిడాలో అత్యున్నత శిఖరాల్లో నిలిచినా వారికి అదృష్టం వరించకపోతే.. కొండల కొద్దీ అనుభవం ఉన్న పనికిరాదు. వీరిని కనీస ధరకు కూడా ఎవ్వరూ కొనేందుకు ఆసక్తి కనబర్చరు. ఈసారి ఐపిఎల్ వేలంలో కూడా ఇలాంటి పరిణామాలో చోటు చేసుకున్నాయి. అపార అనుభవాలు ఉన్న స్టార్ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కనికరం చూపెట్టలేదు. వారి స్టార్‌డమ్ పేరుకు మాత్రమే అన్నట్టుగా అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్ట్‌లోనే వారు మిగిలిపోయారు. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఆడని వారు సైతం ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఎక్కువ ధరలకు అమ్ముడుపోయి సంచలనాలు సృష్టించారు.
కాసుల వర్షం
RELATED ARTICLES