కాశీలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది
ప్రజాపక్షం/హైదరాబాద్ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోచంపల్లి మండలం దేశ్ ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్య తో పాటుగా 25 మంది కాశీలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు. వెంటనే కాశీలో చిక్కుకున్న వారికి వసతి,భోజన సౌకర్యాలు కల్పించాలని కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చర్చలని కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసిన ఎంపీ కోమటిరెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు పంపుతామని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.