సురక్షితంగా వెళ్ళిపోయేందుకు ప్రజలకు అవకాశం
చర్చలకు సిద్ధం
మార్షల్ లా ఆలోచన లేదు : పుతిన్
ఎల్వివ్: ఉక్రేన్‌లో సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా శనివారం పదవరోజు ఉక్రేన్‌లోని రెండు ప్రాంతాలలో తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించింది. పౌరు లు ఈ ప్రాంతాల నుండి ససురక్షితం గా వెళ్ళిపోయేందుకు వీలుగా ఈ కాల్పుల విరమణ అమలు చేస్తున్నట్లు రష్యా వెల్లడించింది. మరియోపోల్, వోల్నోవఖ లలో ఈ ఒప్పందం అమలు చేస్తునారు. అయితే మిగిలినచోట్ల శనివారంనాడు కూడా కాల్పులు, బాంబుల దాడులు కొనసాగాయని స్థానిక వార్తాసంస్థలు తెలియజేశాయి. రష్యా రక్షణమంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేస్తూ, పౌరులు వ్యూహాత్మక యుద్ధ ప్రాంతాల నుండి సురక్షితంగా వెళ్ళిపోయేందుకకు వీలుగా ఉక్రేన్ దళాలతో ఈ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ యత్నాలకు దీనికి ఒక సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉక్రేన్ మధ్య ఆదివారనాడు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉక్రేన్‌తో చర్చల విషయంపై కూడా రష్యా స్పందించింది. ఉక్రేన్‌తో చర్చలనుండి రష్యా వెనక్కు మళ్ళడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ చెప్పారు. చర్చలకు జాప్యం జరిగేకొద్దీ తమ డిమాండ్లు పెరుగుతాయని కూడా ఆయన అన్నారు. ఉక్రేన్‌పై సైనిక చర్య పూర్వరంగంలో రష్యాలో అంతర్గతంగా మార్షల్ లా విధించే అవకాశం లేదని కూడా పుతిన్ స్పష్టం చేశారు. కాగా ఆగ్నేయ ఉక్రేన్‌లోని మరియోపోల్,తూర్పు ప్రాంత నగరం వోల్నోవఖ లలో కాల్పుల విరమణకు ఇరుపక్షాల దళాలు అంగీకరించడాన్ని విశ్లేషకులు ఒక పెద్ద ముందంజగా భావిస్తున్నారు. ప్రజలు యుద్ధ వాతావరణం నుండి బయటపడి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. అయితే ఎంతకాలం, ఎంత సమయం ఈ కాల్పుల విరమణ అమలులో ఉంటుందనే విషయంలో మాత్రం అటు రష్యా ఇటు ఉక్రేన్‌ల నుండి స్పష్టత లేదు. అయితే ఆగ్నేయ ఉక్రేన్‌లోని నగరం మరియోపోల్‌లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉనానయి అనేక రోజులుగా ఇక్కడ కాల్పులు, దాడులు జరుగుతున్నాయి. ఫోన్ సేవలు లేవు, ఆహారం లేదు, నీటి కొరత పీడిస్తోంది,వేలాదిమంది గడ్డకట్టిన ప్రదేశాల్లోనే ఉండిపోయారు. ఔషధ దుకాణాలు అందుబాటులో లేవు. వైద్యులు లేరు. అయితే ఒక ఉన్నతాధికారి మాత్రం, గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కాల్పుల విరమణ గడువు ముగిసిపోతుందన్నారు. ఉదయం 9 గంటలకే ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయడం ప్రారంభించారు. అణువిద్యుత్ కేంద్రం ఉన్న జపోరిజ్జియా నుండి 226 కి మీ వరకూ ఈ మానవతా దృక్పథంతో పౌరులకు వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు.అయితే రష్యా సైనికులు ఈ ఒప్పందాన్ని అమలు చేయడం లేదని మరియోపోల్ డిప్యూటీ మేయర్ సెర్హీ ఓర్లోవ్ ఆరోపించారు. ప్రజలు భయభ్రాంతులవుతున్నారన్నారు.ఉక్రేన్‌కు భద్రతావిభాగాధిపతి ఒలెక్సీయై డేనిలోవ్ రష్యా సైన్యానికి ఒక విజ్ఞప్తి చేస్తూ, స్త్రీలు, పిల్లలు,వృద్ధులు యుద్ధ ప్రాంతాల నుండి వెళ్ళిపోయేందుకు వీలుగా మానవతా మార్గాన్ని అనుమతించాలని కోరారు. మరోవైపు దౌత్యస్థాయీ ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ పోలెండ్‌కు చేరుకున్నారు. పోలెండ్ ప్రధానమంత్రి,విదేశాంగమంత్రులను కలుసుకుని చర్చించారు. ఆయన తొలుత బ్రస్సెల్స్‌లో నాటో సమావేశంలో పాల్గొన్నారు. యూరప్ తూర్పు ప్రాంత సభ్యదేశాల రక్షణే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఆయన యుద్ధ ప్రాంతాలను వీడి వెళ్ళిపోతున్న ప్రజలనుకూడా సరిహద్దుల్లో కలుసుకుంటారు.
నో ఫ్లయ్ జోన్‌కు నాటో తిరస్కృతి
విరుచుకుపడిన జెలెన్‌స్కీ
నో ఫ్లయ్ జోన్ ప్రకటన చేయాలని ఉక్రేన్ దేశాధ్యక్షుడు చేసిన విజ్ఞప్తిని నాటో తిరస్కరించింది. దాంతో ఉక్రేన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటోపై విమర్శలు చేశారు. అయితే అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ దీనికి సమాధానం చెబుతూ, నో ఫ్లయ్ జోన్ వల్ల యూరప్‌లో సమస్యలు మరింతగా పెరుగుతాయని అన్నారు. రష్యా దళాలు వ్యూహాత్మక ప్రాంతాలలో పొంంచి ఉన్నాయన్నారు.ఉక్రేన్‌లో నో ఫ్లయ్ జోన్ ప్రకటన చేయడానికి నాటో తిరస్కరించడాన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుపట్టారు. “ఈ రోజు నుండి మా దేశంలో అందరూ చచ్చిపోతారు, మీ కారణంగా మాత్రమే చచ్చిపోతారు” అని జెలెన్‌స్కీ నాటోపై నిశిత విమర్శలు చేశారు. నో ఫ్లయ్ జోన్ ప్రకటన వల్ల యూరప్‌లో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ఇది రెచ్చగొట్టే చర్యగా ఉంటుందన్నారు. అయితే ఉక్రేన్‌కు అమెరికా, ఇతర నాటో సభ్య దేశాలు అండగా ఉంటున్నాయని, కీవ్‌కు ఆయుధాలు పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉక్రేన్ నుడి 10 లక్షలమంది వలస వెళ్ళిపోయారన్నారు.వారంతా యూరప్ ఖండంలో పలు చోట్లకు వెళ్ళిపోయారన్నారు.
కాల్పుల విరమణ

RELATED ARTICLES