l నేడు నారాయణగూడ వైఎంసిఎ నుంచి భారీ ర్యాలీ
l కార్మికులు, ఉద్యోగులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చిన నేతలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీ సుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు – 2020ని వ్యతిరేకిస్తూ ఈనెల 8న తలపెట్టిన ‘భారత్ బంద్’కు తె లంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేసి రైతాంగానికి తెలంగాణ స మాజం యావత్తు అండగా నిలవాలని ఐక్య వేదిక పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి తీరని నష్టం కలిగించబోతున్నాయని ఆందోళ న వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ బా గ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య వేది క నాయకులు పాల్గొన్నారు. వి.ఎస్.బోస్, బి. వెంకటేశం (ఎఐటియుసి), పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్, ఎస్.రమ ఎం.కె.బోస్ (టిఎన్టియుసి), అనురాధ, కె.సూర్యం(ఐఎఫ్‌టి యు), ఆర్.బి.చంద్రశేఖర్ (ఐఎన్టియుసి), బాబురావు (ఎఐయుటియుసి), రెబ్బరామారావు (హెచ్ఎంఎస్), ఎస్.రాంబాబు కె. వి), వెంకట్రామయ్య(ఫార్మ), సుబ్బారావు(బ్యాంకింగ్), రాజు భట్టులు సమావేశానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంద్ లో భాగంగా మంగళవారం నారాయణగూడ వై ఎంసిఎ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామ ని అన్నారు. ఈ ర్యాలీలో కార్మికులు, ఉద్యోగుల, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పలుపునిచ్చా రు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో అనేక రోజుల నుంచి రైతులు సమరశీల పోరాటాలను నిర్వహిస్తున్నారని అన్నారు. వ్యవసాయ చట్టాలను వెన క్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ, రైతాంగ ఉ ద్యమంపై నిర్భధాన్ని ప్రయోగించి, భాష్పవాయు వు, నీటి ఫిరంగులతో అణచివేయాలని కుట్ర చే స్తుందని విమర్శించారు. మొక్కబోని దీక్షతో రై తాంగం పోరాడుతుందన్నారు. రైతుల ఉద్యమాని కి దేశవ్యాప్తంగా విశాల మద్దతు లభిస్తందన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వ్యవసాయ సంక్షోభం వస్తే ఆ సంక్షో భం పారిశ్రామిక సంక్షోభంగా మారుతుందన్నా రు. కార్మికులు ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలు కూడా కుదేలు అవుతాయని ఆందోళన వ్య క్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, వ్య వసాయ కూలీలు, సామన్య ప్రజలతో పాటు కా ర్మికుల జీవితాలు ఛిద్రం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగంతో పాటు యావత్తు ప్రజానీకం కేంద్ర ప్రభు త్వ విధానాలపై పోరాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతాంగం వీరోచిత పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. పోరాటంలో ప్రాణాలను సై తం త్యాగం చేస్తున్న అన్నదాతలకు ఉద్యోగ, కా ర్మిక సంఘాల ఐక్యవేదిక పోరాట ఉద్యమ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ అఖిల భారత స్థాయిలో రైతు సంఘాల ఐక్య వేదిక 8న భారత్ బంద్‌కు పి లుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ బంద్ కు తెలంగాణ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య వేదిక సంపూర్ణ మద్దతునిస్తుందని నాయకులు ప్రకటించారు. ఉద్యోగులు, కార్మికులు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రైవేట్, రవాణా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక బంద్‌కు మద్దతు
RELATED ARTICLES