మూడు క్రూరమైన లేబర్ బిల్లులకు ఆమోదం
కాంగ్రెస్, వామపక్ష సభ్యుల వాకౌట్
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలతో నిమిత్తం లేకుండా, మోడీ ప్రభుత్వం మందబలం తో మరో మూడు క్రూరాతిక్రూరమైన బిల్లులకు ఆమోదము ద్ర వేసింది. కార్మిక చట్టాల్లో సవరణలకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎనిమిదిమంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికాగా, కాంగ్రెస్, లెఫ్ట్‌పార్టీలకు చెందిన ఎంపీలు వాకౌట్ చేసిన అనంతరం ఎన్‌డిఎ ఎంపీలు రాజ్యసభలో ఈ మూడు లేబర్ బిల్లులకు ముద్ర వేశారు. ఈ కొత్త లేబర్ బిల్లుల ప్రకారం, ప్రభుత్వ అనుమతి లేకుండానే పారిశ్రామిక సంస్థలు 300 మంది కార్మికుల వరకు తొలగించుకోవచ్చు. గతంలో 100 మంది వర కు ఉన్న పరిమితిని ఈ బిల్లు 300కి పెంచింది. కంపెనీల మూసివేతకు గల ఇబ్బందులను కూడా ఈ బిల్లులు తొలగిస్తాయి. అంటే కంపెనీలు ఎప్పుడుపడితే అప్పుడు మూసేయవచ్చు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ మూడు కీలకమైన కార్మిక సవరణ బిల్లులను కార్మిక స్మృతులుగా (కోడ్స్)గా భావిస్తున్నారు. పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన బిల్లులుగా కేంద్ర ప్రభుత్వం వీటిని పేర్కొన్నది. కానీ కార్మికులకు ఉద్యోగ భద్రతను మరింత సంక్లిష్టంగా చేసే విధంగా, పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలకు పూర్తి అనుకూలంగా ఈ బిల్లులు వున్నాయని ఇప్పటికే పది కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 29 కేంద్ర కార్మిక చట్టాలను క్రోడీకరిస్తూ ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని సవరణలు, మార్పులు చేశారు. ఈ మార్పుల్లో అత్యధికం కార్మిక వ్యతిరేకమైనవే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సులువు కావాలంటే కార్మిక చట్టాలను సవరించడం అనివార్యంగా మోడీ ప్రభుత్వం వాదిస్తోంది. కార్మికులకు అనుకూలమైన చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థల పురోగమనం కష్టతరమవుతున్నదని, అందుకే ఈ చట్టాలను సవరించినట్లుగా ప్రభుత్వ వర్గాలే స్వయంగా చెపుతున్నాయి. ఈ బిల్లులను లోక్‌సభ మంగళవారంనాడే ఆమోదించగా, బుధవారంనాడు రాజ్యసభ ఆమోదించింది. కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు వీటిని వ్యతిరేకించారు. ఇరు వైపులా వాదోపవాదాలు జరిగాయి. గందరగోళ పరిస్థితుల నడుమ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఎన్‌డిఎ సభ్యులు ఈ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. కార్మికుల రిట్రెంచ్‌మెంట్‌కు సంబంధించి కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ చెప్పిన వివరణను ప్రతిపక్షాలు త్రోసిపుచ్చాయి. కొన్ని సవరణలు, మార్పులు చేశారు. ఈ మార్పుల్లో అత్యధికం కార్మిక వ్యతిరేకమైనవే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సులువు కావాలంటే కార్మిక చట్టాలను సవరించడం అనివార్యంగా మోడీ ప్రభుత్వం వాదిస్తోంది. కార్మికులకు అనుకూలమైన చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థల పురోగమనం కష్టతరమవుతున్నదని, అందుకే ఈ చట్టాలను సవరించినట్లుగా ప్రభుత్వ వర్గాలే స్వయంగా చెపుతున్నాయి. ఈ బిల్లులను లోక్‌సభ మంగళవారంనాడే ఆమోదించగా, బుధవారంనాడు రాజ్యసభ ఆమోదించింది. కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు వీటిని వ్యతిరేకించారు. ఇరు వైపులా వాదోపవాదాలు జరిగాయి. గందరగోళ పరిస్థితుల నడుమ కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఎన్‌డిఎ సభ్యులు ఈ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. కార్మికుల రిట్రెంచ్‌మెంట్‌కు సంబంధించి కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ చెప్పిన వివరణను ప్రతిపక్షాలు త్రోసిపుచ్చాయి.