బినోయ్ విశ్వం డిమాండ్
న్యూఢిల్లీ : రోజు కూలీలను కార్మికవర్గంలో భాగంగా పరిగణించాలని సిపిఐ సభ్యుడు బినొయ్ విశ్వం రాజ్యసభ శూన్యగంటలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని కార్మికవర్గంలో భాగంగా పరిణగణిస్తే ఉద్యోగులకు లభించే ప్రయోజనాలన్నీ వారికి కూడా లభిస్తాయని దాని వల్ల వారి జీవితాలు మెరుగుపడతాయని కోరారు. ఆర్‌జెడి సభ్యుడు మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ, దేశంలో కనీస వేతనాలను ఒకసారి సమీక్షించాలని, దీనివల్ల ద్రవ్యోల్బణ సూచికకు దీనిని అనుసంధానం చేయడం ద్వారా ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికుల వేతనాలలో పెరుగుదలకు వీలు కలుగుతుందని అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గుల్బర్గాలోని ఇఎస్‌ఐసి ఆసుపత్రిని ఎఐఐఎంఎస్‌గా మార్పుచేయాలని కోరగా, టిఎంసి సభ్యుడు శంతన్ సేన్ వృద్ధులకు ఒక సమగ్ర కార్యాక్రమానిన రూపొందించాలని కోరారు. 2021 మేజర్ పోర్టు అథారిటీ చట్టం కంటకంగా మారిందని, సమాఖ్య వ్యవస్థపై ఈ చట్టం దాడి చేస్తోందని మరో టిఎంసి సభ్యుడు లూయిజిన్హో ఫలైరో విమర్శించారు. దీనివల్ల వివిధ రేవుల నుండి డ్రై ఫూయల్‌ను భారీ ఎత్తున దిగుమతి చేకోవాల్సి రావడంతో గోవా రాష్ట్రం బొగ్గు రాష్ట్రంగా మారిపోతోందని విమర్శించారు. స్వతంత్ర సభ్యుడు అజిత్ కుమార్ భుయాన్ అసోం జాతీయ రహదారులపై టోల్ వసూళ్ళ సమస్యను ప్రస్తావించారు.
ఒకేసారి ఎన్నికలు ఖర్చు తగ్గుతుంది :
రాజ్యసభలో బిజెపి సభ్యుడి సూచన
లోక్‌సభ,అసెంబ్లీ,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని దీనివల్ల దేశ ఖజానాకు ఖర్చులు కలిసివస్తాయని రాజ్యసభలో బిజెపి సభ్యుడు డి.పి.వత్స్ అన్నారు. గురువారం రాజ్యసభ శూన్యగంటలో వత్స్ ఈ విషయం ప్రస్తావిస్తూ, జాతీయ వనరుల ఖర్చు తగ్గించేందుకు ఈ సూచన దోహదపడుతుందన్నారు. దేశం ఎల్లకాలం ఎన్నికల భావనతోనే ఉండిపోతోందని,ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పద్ధతులవల్ల వనరుల ఖర్చు పెరిగిపోతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వనరుల భారంతోపాటు
మానవ వనరుల కేటాయింపు వ్యయం కూడా తగ్గిపోతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒకేసారి అన్ని ఎన్నికలకు వీలుగా కొన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం లేదా ఇతర పద్ధతులు అనుసరిస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారు. ఈ దిశగా పార్లమెంటు,అసెంబ్లీ,పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయ సాధన అవసరమని ఆయన అన్నారు.
మాతృవందనం పథకం దరఖాస్తు విధానం మార్చండి
కాంగ్రెస్ సభ్యురాలు ఛాయా వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మాతృవందన యోజన కథకం కింద దరఖాస్తు చేసుకునే విధానాన్ని సంక్షిప్తం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద రూ.5,000 నగదు ప్రోత్సాహం గరిణీలకు సమకూరుస్తారు. పాలిచ్చే తల్లులకు తమ తొలి బిడ్డను జాగ్రత్తగా పాలిచ్చి పెంచుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద దరఖాస్తుచేయడానికి ఫారంలో విభిన్న రకాలైన 40 కాలమ్స్‌ను గర్భిణీ పూర్తి చేయవలసి వస్తోందని ఛాయా వర వాపోయారు. కానీ రెండో బిడ్డ పుడితే ఈ పథకం తల్లికి వర్తించడ లేదని, ఒకవేళ మొదటి బిడ్డ గర్భంలోనే తొలి దశలో గర్భస్రావం జరిగినా కూడా ఇక ఆ తల్లికి మరోసారి ఈ పథకం పొందే అవకాశం లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. అందువల్ల ఈ దరఖాస్తు చేసుకునే పద్దతిని సంక్షిప్తీకరించాలని, రెండో బిడ్డకు కూడా వర్తించేలా చూడాలని కోరారు.
కార్మికవర్గంలో రోజు కూలీలకు భాగస్వామ్యం
RELATED ARTICLES