నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
మృతులంతా హైదరాబాద్ వాసులే..
ప్రజాపక్షం/నారాయణపేట బ్యూరో నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో ఓ కారు బోల్తాపడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ఎల్లయ్య కుటుంబ సభ్యులు కర్ణాటకలోని రాయచూర్ వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు గుడిగండ్ల వద్ద కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎల్ల య్య, ఆయన భార్య గోవిందమ్మ, ఆయన సోదరి శారద, కూతురు హారిక మృతిచెందారు. కారు డ్రైవర్ వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. మరో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే మృతులంతా ఉపాధికోసం పదేళ్ల క్రితం నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వలస వెళ్లారని తెలుస్తున్నది.
కారు బోల్తా.. నలుగురు దుర్మరణం
RELATED ARTICLES